Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంక్రాంతి ప్రత్యేక రైళ్లు రెడీ : ఎక్కడి నుంచి ఎక్కడ దాకా - ఎప్పుడెప్పుడంటే..!!

Sankranti Special Trains: కొత్త సంవత్సరం మొదలవుతోంది. సంక్రాంతి సెలవులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సొంత ప్రదేశాలకు..ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారి సంఖ్య ప్రతీ ఏటా పెరిగిపోతోంది. ఈ సారి సంక్రాంతికి ఇప్పటికే రైళ్లన్నీ నిండిపోయాయి. రెగ్యులర్ రైళ్లల్లో వెయింట్ లిస్టు భారీగా కనిపిస్తోంది. కొన్ని ప్రధాన రైళ్లలో రిజర్వేషన్ కూడా తీసుకోవటం లేదు. దీంతో, పెరుగుతున్న రద్దీని పరిణగణలోకి తీసుకొని దక్షిణ మధ్య రైల్వే సంక్రాంతికి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏ రోజుల్లో..ఏ రూట్లలో ఈ రైళ్లు నడిచేదీ వివరాలను వెల్లడించింది.

సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్

సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్

ఇప్పటికే రెగ్యులర్ రైళ్లన్నీ సంక్రాంతికి ముందుగానే ఫుల్ అయ్యాయి. దీంతో, ఏ లైన్లలో రద్దీ ఎక్కువగా ఉందో దక్షిణ మధ్య రైల్వే గుర్తించింది. రద్దీ, ప్రయాణీకుల డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యేక రైళ్ల రూట్లను ఖరారు చేసింది. అందులో భాగంగా.. 14 ప్రత్యేక రైళ్లను పలు మార్గాల్లో నడపాలని నిర్ణయించారు. జనవరి 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి.ఇందులో అధికంగా తెలుగు రాష్ట్రాల మధ్యనే కేటాయించారు. సికింద్రాబాడ్, కాచిగూడ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసారు. వీటికి రిజర్వేషన్ ప్రారంభం అయింది.

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయార్టీ

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సంక్రాంతి వేళ ఉండే రద్దీకి అనుగుణంగా ఈ ప్రత్యేక రైళ్లను ఖరారు చేసారు. ప్రత్యేకించి ఏపీలో సంక్రాంతి రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా హైదరాబాద్ నుంచి సొంత గ్రామాలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. దీంతో, మచిలీపట్నం-కర్నూల్, మచిలీపట్నం-తిరుపతి, విజయవాడ-నాగర్‌సోల్, కాకినాడ-లింగంపల్లి, అకోలా-పూర్ణ పట్టణాల మధ్య ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. మచిలీపట్నం నుంచి కర్నూలు సిటీ (ట్రైన్ నెంబర్.07067) జనవరి 3,5,7,10,12,14,17వ తేదీలలో అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా కర్నూలు సిటీ నుంచి మచిలీపట్నం (ట్రైన్ నెం.07068) 4,6,8,11,13,15,18వ తేదీలలో నడుపునున్నారు. మచిలీపట్నం నుంచి తిరుపతి (ట్రైన్ నెం.07095) 1,2,4,6,8,9,11,13,15,16వ తేదీలలో ప్రత్యేక రైలు అందుబాటులో ఉండనుంది.

రైళ్ల రూటు - కేటాయించిన తేదీలు

రైళ్ల రూటు - కేటాయించిన తేదీలు

విజయవాడ నుంచి నాగర్‌సోల్ (ట్రైన్ నెం.07698) 6,13వ తేదీలలో, నాగర్‌సోల్ నుంచి విజయవాడ (07699) 7,14వ తేదీలలో రైళ్లు ప్రకటించారు. కాకినాడ నుంచి లింగంపల్లి (07445) వరకు 2,4,6,9,11,13,16,18వ తేదీలలో.. లింగంపల్లి నుంచి కాకినాడ (07446)కు 3,5,7,10,12,14,17,19వ తేదీలలో ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. అదేవిధంగా తిరుపతి నుంచి మచిలీపట్నం (రైలు నెం.07096) 2,23,5,7,9,10,12,14,16,17వ తేదీలలో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసారు. తిరుపతి నుంచి అకోలా (07605) ట్రైన్ 6,13వ తేదీల్లో.. అకోలా నుంచి తిరుపతికు (07606) 8, 15వ తేదీలలో ప్రత్యేక రైళ్లు షెడ్యూల్ చేసారు. పూర్ణ నుంచి తిరుపతికి (ట్రైన్ నెం.07607) 2,9,16వ తేదీలలో, తిరుపతి నుంచి పూర్ణకు (రైలు నెం.07608) 3,10,17వ తేదీలలో స్పెషల్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. రైళ్ల రాకపోకలకు సంబంధించి వేళలను దక్షిణ మధ్య రైల్వే తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+