Trains Cancellation : రేపటి నుంచి వారం పాటు 52 రైళ్ల రద్దు-18 పాక్షికంగా రద్దు-వివరాలివే..

ఏపీ, తెలంగాణ పరిధిలో నడుస్తున్న పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రేపటి నుంచి రద్దు చేస్తోంది. వీటిలో కొన్ని వారం రోజుల పాటు రద్దు చేస్తుండగా.. మరికొన్ని పాక్షికంగా కొన్ని తేదీల్లో మాత్రమే రద్దు కానున్నాయి. విజయవాడలో రైల్వే నాన్-ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ 70 రైళ్లను రద్దు చేయాల్సి వస్తోందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే రేపటి నుంచి రద్దవుతున్న రైళ్ల వివరాలను కూడా వెల్లడించింది.

విజయవాడలో రైల్వే పనుల కారణంగా రద్దవుతున్న రైళ్లలో పలు ఎక్స్ ప్రెస్, పాసింజర్, గరీబ్ రధ్, జన్మభూమి వంటి రైళ్లు ఉన్నాయి. వీటిలో 52 రైళ్లను రేపటి నుంచి కొన్ని, ఎల్లుండి నుంచి కొన్ని వారం రోజుల పాటు రద్దు కానున్నాయి. అలాగే మరో 18 రైళ్లు పాక్షికంగా అంటే వివిధ తేదీల్లో రద్దు కానున్నాయి. వీటి రాకపోకలకు, రద్దులకు సంబంధించిన వివరాలను రైళ్ల వారీగా దక్షి మధ్య రైల్వే అధికారులు ఇవాళ ప్రకటించారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.

south central railway cancels 52 trains for one week and 18 partially due to non-interlocking works

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైళ్ల రద్దుతో వేల కొద్దీ ప్రయాణికుల మీద ప్రభావం పడబోతోంది. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్దితి ఉంది. అయితే పండగలు, సెలవుల సీజన్ కాకపోవడంతో రద్దీ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయినా రోజువారీ ప్రయాణాలు చేసే వారిపై ఈ రైళ్ల రద్దు నిర్ణయం తీవ్ర ప్రభావం చూపబోతోంది. ఏపీ, తెలంగాణలో అంతర్గతంగా వివిధ నగరాలు, ప్రాంతాల మధ్య ప్రయాణాలు చేసే వారితో పాటు ఇరు రాష్ట్రాల మధ్య నిత్యం ప్రయాణించే వారిపై ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది.

జన్మభూమి, గరీబ్ రధ్ వంటి రద్దీ ఉన్న రైళ్లు కూడా వారం రోజుల పాటు నిలిచిపోనుండటం ప్రయాణికుల్ని తీవ్ర నిరాశకు గురి చేసే నిర్ణయమే అయినప్పటికీ రైల్వే నాన్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో మార్పులు, రిపేర్లు చేయాల్సి రావడంతో ఈ పరిస్ధితి తప్పడం లేదని తెలుస్తోంది. అసలే ఒడిశాలో రైలు ప్రమాదం జరిగి 300 మందికి పైగా చనిపోయిన నేపథ్యంలో రైల్వే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.

south central railway cancels 52 trains for one week and 18 partially due to non-interlocking works
south central railway cancels 52 trains for one week and 18 partially due to non-interlocking works
south central railway cancels 52 trains for one week and 18 partially due to non-interlocking works
south central railway cancels 52 trains for one week and 18 partially due to non-interlocking works
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+