దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 32 రైళ్లకు తాత్కాలిక స్టాప్ ల కొనసాగింపు-6 నెలల పాటు..!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల అవసరాల్ని, డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని అధికారులు పలు ప్రయోగాత్మక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు స్టేషన్లలో దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు ప్రయోగాత్మకంగా స్టాప్ లు ఇస్తున్నారు. ఇలా ఇప్పటికే ఇచ్చిన పలు రైళ్ల తాత్కాలిక స్టాప్ లను ఆరు నెలల పాటు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో తిరిగే పలు రైళ్లతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులు కూడా ఉన్నాయి.
ఈ నెల 14 నుంచి దశల వారీగా మొత్తం 32 రైళ్లకు వివిధ స్టేషన్లలో తాత్కాలిక హాల్ట్ లు ఇస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. ఇందులో పూరి, తిరుపతి, బిలాస్ పూర్, హౌరా, పుదుచ్చేరి, యశ్వంత్ పూర్, బెంగళూరు, నాందేడ్, కాజీపేట, పూణే, నరసాపూర్, నాగర్ సోల్, సిర్పూర్ కాగజ్ నగర్, బీదర్, విజయవాడ, సికింద్రాబాద్, గుంటూరు, రేపల్లె, తిరుపతి వంటి నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణించే పలు రైళ్లు ఉన్నాయి.


ఆయా రైళ్లకు ఎంపిక చేసిన స్టేషన్లలో తాత్కాలిక హాల్ట్ లు ఇవ్వడం ద్వారా అక్కడ ప్రయాణికుల రద్దీని అంచనా వేసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వేకు అవకాశం దక్కనుంది. అందుకే ఆరు నెలల పాటు ఈ హాల్ట్ లను పొడిగిస్తున్నారు. ఆ తర్వాత రద్దీని అంచనా వేసుకుని రైళ్ల రాకపోకల్లో మార్పులు చేర్పులతో పాటు కొత్త రైళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు, ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖకు ఓ అంచనా రానుంది. ఆ తర్వాత మరిన్ని మార్పులు అమల్లోకి రానున్నాయి.












Click it and Unblock the Notifications