సికింద్రాబాద్, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు వారికి ముఖ్య గమనిక
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి సికింద్రాబాద్ నుంచి గుంటూరు, నెల్లూరు మీదగా ప్రయాణించనున్నాయి. తమిళనాడులోని వేళాంగిణి మాత ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక రైళ్లను వేలన్ కన్నీ వరకు నడుపుతున్నారు. వాటి వివరాలు..
No.07161: సికింద్రాబాద్-వేలన్ కన్నీ (Velankanni) రైలు ఈ నెల 27, 29 తేదీల్లో నడవనుంది. ఈ రెండు తేదీల్లో ఉదయం 8.00 గంటలకు సికింద్రాబాద్ లో బయలుదేరి.. తర్వాతరోజు 9.15 గంటలకు వేలన్ కన్నీకి చేరుకుంటుంది.No.07162: వేలన్ కన్నీ-సికింద్రాబాద్ రైలు ఈ నెల 29, 31 తేదీల్లో నడవనుంది. 00:30 గంటలకు వేలన్ కన్నీలో బయలుదేరి తర్వాతరోజు ఉదయం 3.35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంది.ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్, విల్లుపురం, చిదంబరం, తిరువారూర్ స్టేషన్లలో ఆగుతుంది.

No.01161: ముంబయి LTT-వేలన్ కన్నీ మధ్య ఈ నెల 26న ప్రత్యేక రైలును అధికారులు ప్రకటించారు. ఈ రైలు 26వ తేదీ మధ్యాహ్నం 1.00 గంటకు ముంబయిలో బయలుదేరి.. తర్వాతరోజు రాత్రి 8.35 గంటలకు వేలన్ కన్నీ చేరుకుంటుంది.No.01162: వేలకన్నీ-ముంబయి LTT మధ్య ఈ నెల 29న ప్రత్యేక రైలు నడవనుంది. ఉదయం 6.00 గంటలకు వేలన్ కన్నీలో బయలుదేరి.. తర్వాతరోజు సాయంత్రం 16.30 గంటలకు ముంబయి చేరుకుంటుంది.ఈ రైళ్లు థానే, కల్యాణ్, పూణే, దౌడ్, సోలాపూర్, వాడీ, రాయిచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, కడప, రేణిగుంట, వెల్లూరు కంటోన్మెంట్, తిరువారూర్ స్టేషన్లలో ఆగుతాయి.
No.01163: ముంబాయి ఎల్టీటీ-వేలన్ కన్నీ రైలు సెప్టెంబర్ 6న నడపనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 1:40 గంటలకు ముంబయిలో బయలుదేరి.. తర్వాతరోజు రాత్రి 00:30 గంటలకు వేలన్ కన్నీ చేరుకుంటుంది.No.01164: వేలన్ కన్నీ-ముంబాయి ఎల్టీటీ ప్రత్యేక రైలును సెప్టెంబర్ 8న నడపనున్నారు. ఆరోజు రాత్రి రాత్రి 11.50 గంటలకు వేలన్ కన్నీలో బయలుదేరి.. తర్వాతరోజు ఉదయం 7.00 గంటలకు ముంబయి చేరుకుంటుంది.ఈ రైళ్లు థానే, పూణే, సోలాపూర్, వాడీ, రాయిచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, కడప, రేణిగుంట, కాట్పాడి జంక్షన్, వెల్లూరు కంటోన్మెంట్, విల్లుపురం జంక్షన్, తిరువారూర్ జంక్షన్ లో ఆగుతాయి.












Click it and Unblock the Notifications