ఏపీ ప్రజలకు హెచ్చరిక... ఈ రైళ్లకు సికింద్రాబాద్ స్టాప్ ఎత్తివేత!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగిపోతుండటంతో రూ.450 కోట్లతో ప్రత్యామ్నాయ టెర్మినల్ గా చర్లపల్లి రైల్వేస్టేషన్ ను తీర్చిదిద్దారు. నగరంలో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడతోపాటు లింగంపల్లి స్టేషన్ కూడా ఉంది. ఇవి కాకుండా చర్లపల్లిని అభివృద్ధి చేసి 9 ప్లాట్ ఫామ్స్ తో దాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి బయలుదేరే రైళ్లను, సికింద్రాబాద్ మీదుగా నడిచే రైళ్లను చర్లపల్లి మీదుగా దారి మళ్లించారు. కొన్నింటిని అక్కడి నుంచి నడిపిస్తున్నారు.
తాజగా ఏపీలోని విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు నడిచే కొన్ని రైళ్లకు సికింద్రాబాద్ స్టాప్ ఎత్తేశారు. రద్దీని నియంత్రించేందుకు నాలుగు రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్ జాబితా నుంచి తప్పించారు.

లోకమాన్య తిలక్ నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు ఏప్రిల్ 22 నుంచి చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
విశాఖపట్నం నుంచి లోకమాన్య తిలక్ వెళ్లే రైలు ఏప్రిల్ 24 నుంచి చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
సంబల్‌పూర్-నాందేడ్ సూపర్ ఫాస్ట్ రైలు ఏప్రిల్ 25 నుంచి చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
నాందేడ్-సంబల్‌పూర్ సూపర్ ఫాస్ట్ రైలు ఏప్రిల్ 26 నుంచి చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఇవి వారానికి మూడు రోజులు మాత్రమే నడుస్తాయి.
విశాఖపట్నం-నాందేడ్ రైలు ఏప్రిల్ 26 నుంచి చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
నాందేడ్-విశాఖపట్నం రైలు ఏప్రిల్ 27 నుంచి చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
విశాఖపట్నం-సాయినగర్ షిర్డీ సూపర్ ఫాస్ట్ ఏప్రిల్ 24 నుంచి చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
సాయినగర్ షిర్డీ-విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఏప్రిల్ 25 నుంచి చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
ఇప్పటికే విశాఖ-లింగంపల్లి జన్మభూమిని చర్లపల్లికి మార్చారు. ప్రతిరోజు సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి 12 రైళ్లు విశాఖపట్నంకు ప్రయాణిస్తాయి. అయినా ప్రయాణికుల నుంచి ఇంకా డిమాండ్ ఉంటూనే ఉంది. రెండు వందేభారత్ రైళ్లు నడుస్తున్నా 150 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. చర్లపల్లిమీదుగా మార్చిన రైళ్లకు బదులుగా సికింద్రాబాద్ నుంచి వేరే రైళ్లను ప్రకటించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications