వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేన మెంబర్‌షిప్‌కు ప్రత్యేక యాప్: పవన్ కళ్యాణ్ సూచనలతో మార్పులు

జనసేన పార్టీ సభ్యత్వ నమోదుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేశారు. పార్టీకి చెందిన ఐటీ విభాగం ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన పార్టీ సభ్యత్వ నమోదుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేశారు. పార్టీకి చెందిన ఐటీ విభాగం ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలించింది.

జనసేనకు సంబంధించి విశ్లేషకులు, వక్తలు, కంటెంట్‌ రచయితలతో ఏర్పాటు చేసే జన సైనికుల విభాగం ఎంపిక కోసం సుమారు డెబ్బై వేల మంది దరఖాస్తు చేశారు. పార్టీని అభిమానించే వీరందరి వివరాలు కార్యాలయంలో ఉన్నాయి.

జగన్‌ను కలిశా, కానీ: రూ.50 కోట్లు ఇస్తేనే వైసిపి టిక్కెట్‌పై విష్ణు వర్ధన్ రెడ్డిజగన్‌ను కలిశా, కానీ: రూ.50 కోట్లు ఇస్తేనే వైసిపి టిక్కెట్‌పై విష్ణు వర్ధన్ రెడ్డి

వీరి సేవలను సభ్యత్వ నమోదులో వినియోగించుకోవాలని జనసేన భావిస్తోంది. యాప్‌తోపాటు పార్టీ వెబ్‌సైట్‌లో సభ్యత్వ నమోదుకు ప్రత్యేకంగా ఆప్షన్‌ ఇవ్వబోతున్నారు.

Special app for Jana Sena

ఈ నెల చివరి వారంలోగానీ, నవంబర్‌ మొదటి వారం నుంచిగానీ సభ్యత్వ నమోదు ప్రక్రియను మొదలుపెట్టాలని పార్టీ యోచిస్తోంది. యాప్‌ ద్వారా నమోదు చేసే విధానంపై పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ కూడా ఐటీ విభాగంతోపాటు పార్టీ ముఖ్యులతో చర్చించారు. ఆయన సూచనలకు అనుగుణంగా మార్పులుచేర్పులు చేశారు.

కర్నూలులో రెండూ ఖాళీ, జగన్ రంగంలోకి దిగినా: బుట్టా రేణుక దారిలో మరో ఇద్దరుకర్నూలులో రెండూ ఖాళీ, జగన్ రంగంలోకి దిగినా: బుట్టా రేణుక దారిలో మరో ఇద్దరు

సభ్యత్వం తీసుకునే వారి వివరాలు పక్కాగా నమోదు చేయనున్నారు. అలాగే, వారి మొబైల్‌ నంబర్‌కి ఎప్పటికప్పుడు పార్టీ విశేషాలు అందనున్నాయి. రాజకీయంగా తటస్థ వైఖరితో ఉన్న వివిధ వర్గాలవారిని, వృత్తి నిపుణుల్ని కూడా జనసేన సభ్యులుగా చేర్చుకోవాలని నిర్ణయించారు.

పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేయాలనే యోచనలో ఉన్నారు. అంతకు ముందుగానే సభ్యత్వ నమోదును మొదలుపెడతారు. అలాగే జన సైనికులుగా సేవలందించేందుకు దరఖాస్తు చేసుకొన్న వారితోనూ జిల్లాలవారీగా పవన్‌ కళ్యాణ్ సమావేశం కానున్నారు.

English summary
Special app for Jana Sena membership. Jana Sena chief Pawan Kalyan will tour in Telugu States soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X