వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ వ్యాఖ్యలు: రాయపాటి,బొండాఇలా, ఉండవల్లి అలా...

ప్రత్యేక హోదా అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలపై బిజెపి, టిడిపి నాయకులు వివరణలు ఇస్తున్నారు. పవన్ తీరును బిజెపి నాయకులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి : జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టిడిపి, బిజెపి నాయకులు స్పందిస్తున్నారు. పవన్ కు వివరణ ఇస్తున్నారు.

ప్రత్యేక హోదా అంశంపై సినీ నటుడు పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకొని విమర్శలను ఎక్కుపెట్టారు. ఈ విమర్శలపై ఈ రెండు పార్టీల నాయకులు వివరణ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బిజెపి నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రతి అంశాన్ని పవన్ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని బిజెపి ఎదురుదాడికి ప్రయత్నించింది.

మరో వైపు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ చేసిన సూచనలను అధికార టిడిపి సానుకూలంగానే స్పందించింది.పవన్ చేసిన సూచనలను తాము పాజిటివ్ గా తీసుకొంటామని ప్రకటించింది టిడిపి, మరో వైపు కేంద్ర మంత్రి సుజానాచౌదరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అలా చేయాల్సి ఉండకూడదని ఆ పార్టీ అభబిప్రాయపడింది.

ప్రత్యేక ప్యాకేజీలో కొత్తదనమేమి లేదు

ప్రత్యేక ప్యాకేజీలో కొత్తదనమేమి లేదు

ఆంద్ర,ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు.రాష్ట్రాన్ని విభజించకూడదంటూ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మాణం చేసినా కాని,, తీర్మాణానికి విరుద్దంగా రాష్ట్రాన్ని విభజించారని ఆయన విమర్శించారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చానని చెబుతున్న ప్యాకేజీ బోగస్ అని ఉండవల్లి ఆరోపించారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు నిలబెట్టానని చెబుతున్న ముఖ్యమంత్రి ప్రకటనలన్నీ నేతి బీరకాయలో నేతి చందమేనని చెప్పారు.ఎపి పునర్విభజన చట్టంలో ఉన్న వాటినే ప్రత్యేక ప్యాకేజీలో చేర్చారని ఆయన ఆరోపించారు. ప్రత్యేకప్యాకేజీలో కొత్త విషయాలు లేవని ఆయన చెప్పారు.ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఎపికి ప్రత్యేక ప్యాకేజీ కూడ పునర్విభజన చట్టంలో ఉన్నవాటినే పొందుపర్చారని చెప్పారు.

బ్యాంకులకు అప్పులు చెల్లించాను

బ్యాంకులకు అప్పులు చెల్లించాను

జనసేన అధినేత రాయపాటి సాంబశివరావు టిడిపిఎంపిలను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేశారు. ముఖ్యంగా నర్సరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావుపై పవన్ మాటల తూటాలు పేల్చారు. ఈ ఆరోపణలపై రాయపాటి వివరణ ఇచ్చారు. బ్యాంకులకు అప్పులున్న మాట వాస్తవమేనని ఆయన చెప్పారు.పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు తనకు కాంగ్రెస్ పార్టీ హయంలోనే వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు.పవన్ ఆరోపణలపై రాయపాటి స్పందించారు. తాను ఏ బ్యాంకుకు కూడ అప్పులు ఎగ్గొట్టలేదన్నారు.

ప్రతిదీ పవన్ కు రాజకీయమేనా

ప్రతిదీ పవన్ కు రాజకీయమేనా

ప్రత్యేక హోదా వల్ల ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అనేక ప్రయోజనాలను కోల్పోతోందని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర వైఖరిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టడాన్ని ఆరోగ్యమంత్రి కామినేని తప్పుబట్టారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర సహయం అవసరమని చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా 20 వేల మంది యువత ఉపాధి పొందుతున్నారని, అలాంటి ట్రస్టుపై విమర్శలు చేయడం సరైందికాదని మంత్రి అభిప్రాయపడ్డారు.

పవన్ సూచనలను పరిగణనలోకి తీసుకొంటాం

పవన్ సూచనలను పరిగణనలోకి తీసుకొంటాం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టిడిపి ఎంఏల్ఏ బొండా ఉమామహేశ్వర్ రావు స్పందించారు. కేంద్రమంత్రి సుజానా చౌదరి,నర్సరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావులు బ్యాంకులకు డబ్బులు ఎగవేయలేదన్నారు.. రాజధాని రైతుల సమస్యలు, ఉద్ధానం సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు.సుజానా చౌదరి, రాయపాటి సాంబశివరావులపై పవన్ వ్యాఖ్యలు సరైనవి కావన్నారు ఉమా.వీరిద్దరిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని ఆయన చెప్పారు.అయితే కేంద్ర మంత్రి సుజానాచౌదరి పందుల ఆటలు ఆడుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు తప్పేనని బొండా ఉమా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి పవన్ చేసిన సూచనలను పాజిటివ్ గా తీసుకొంటామని ఆయన చెప్పారు.

సినిమాలు లేకే పవన్ ప్రత్యేకహోదాపై పోరాటం

సినిమాలు లేకే పవన్ ప్రత్యేకహోదాపై పోరాటం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సినిమాలు తగ్గినందుకే ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొన్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విమర్శించారు.పవన్ కళ్యాణ్ కు రాజకీయ అనుభవం లేదన్నారు. రాజకీయ అనుభవం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ విశాఖకు పరిగెత్తడం సిగ్గుచేటన్నారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి . ఎపికి ప్రత్యేక హోదా రాదని, హోదాతో రాయలసీమకు ఒరిగేదేమీ లేదన్నారు బైరెడ్డి.రాయలసీమ సమస్యలపై పవన్ ఒక్కసారైనా ట్వీట్ చేశారా అని ఆయన ప్రశ్నించారు.

ట్విట్టర్‌లో పవన్ కల్యాణ్ రెచ్చగొడితే...

ట్విట్టర్‌లో పవన్ కల్యాణ్ రెచ్చగొడితే...

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి, బిజెపి నేత మంత్రి మాణిక్యాలరావు మండిపడ్డారు. పవన్ ట్విట్టర్‌లో అభిమానులను రెచ్చగొడితే..ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి పడుతున్న ప్రతి అడుగు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చలవేనని అన్నారు. ఏపీకి పరిశ్రమలు రావడం వెనక వెంకయ్య కృషి చాలా ఉందని మాణిక్యాలరావు ప్రశంసించారు.

English summary
special status is the only solution for andhrapradesh says former mp arunkumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X