నెల్లూరు జిల్లాలో కాటేసిన కల్తీ మద్యం...ఇద్దరి మృతి:కలకలం
నెల్లూరు:నెల్లూరు జిల్లాలో కల్తీ మద్యం ఇద్దరి ఉసురు తీసింది. మద్యం తాగిన కొంతసేపటికే ఇరువురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతులను భాషా, షకీర్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే...
నెల్లూరు జిల్లా దామరమడుగుకు చెందిన ఖాదర్ బాషా, షాకీర్‌లు ఆత్మకూరులో జరిగిన పెళ్లి వేడుకకు గుర్రాన్ని తీసుకెళ్లారు. తిరుగు ప్రయాణంలో కాగులపాడులోని మద్యం దుకాణంలో వీరు మద్యాన్ని కొనుగోలు చేసి ఇంటికి వచ్చి తాగారు. ఆ తరువాత కొద్దిసేపటికే వీరిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.

అయితే కల్తీ మద్యం కారణంగానే వీరిద్దరూ మరణించారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications