ఢిల్లీలో శ్రీవారి వైభవం: అద్వానీ సంతోషం, ఇక్కడే ఆశీస్సులు పొందండి: వెంకయ్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం శ్రీవారి వైభవోత్సవం ప్రారంభమైంది. ఢిల్లీ ప్రజలు శ్రీవారి ఆశీస్సులు పొందాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. స్వర్ణభారతి, టిటిడి, జిఎంఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.
ఇవి నవంబర్ 8వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో బిజెపి అగ్రనేత ఎల్ కె అద్వానీ, కేంద్రమంత్రి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అద్వానీ మాట్లాడారు. శ్రీవారిని ఢిల్లీలోనే దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

తిరుపతి వెళ్లలేని భక్తు కోసం ఇక్కడే వైభవోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. తన కుటుంబం అంతా ఈ వైభవోత్సవంలో పాల్గొంటుందని అద్వానీ చెప్పారు. దీనిని నిర్వహించిన వెంకయ్య నాయుడికి ధన్యవాదాలు అన్నారు.
వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ఢిల్లీ ప్రజలు శ్రీవారి ఆశీస్సులు పొందాలన్నారు. ఈ వైభవోత్సవంలో పాల్గొనాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. టిటిడి, జిఎంఆర్, స్వర్ణభారతి ట్రస్ట్ కలిసి దీనిని నిర్వహిస్తోందని చెప్పారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications