అది మన సీటేనా అంటే మాట్లాడరే: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఏ పార్టీకా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అన్నిరకాలుగా ప్రణాళికలను రచించుకొని వాటిని అమలుపరుచుకుంటూ ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం దృష్టి సారించాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికల సమయంలో వైసీపీ పైచేయి సాధించింది. మరోసారి అవే ఫలితాలను పునరావృతం చేయాలని వైసీపీ యోచిస్తుండగా, తమ పట్టును నిరూపించుకోవాలనే ధ్యేయంతో టీడీపీ ఉంది.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ఎచ్చెర్ల. ఇక్కడి నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన గొర్లె కిరణ్ కుమార్ విజయం సాధించారు. టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుపై 18,711 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కళా వెంకట్రావు తన సమీప ప్రత్యర్థి, వైసీపీ తరఫున పోటీచేసిన పిన్నిటి సాయిపై 4741 ఓట్ల తేడాతో గెలుపును కైవసం చేసుకున్నారు.

srikakulam district etcherla assembly constituency details

1967లో నియోజకవర్గంగా ఏర్పాటైన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన ఎన్ ఏ నాయుడు ఘనవిజయం సాధించారు. తర్వాత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి, ఆ తర్వాత ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించాయి. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత వరుసగా ఐదు ఎన్నికల్లో 1999 వరకు కె.ప్రతిభా భారతి గెలుపు బావుటాను ఎగరవేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా గెలుపొందిన కొండ్రు మురళీమోహన్ 2004లో ఇక్కడి నుంచి విజయం సాధించారు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మారుస్తూ వస్తున్న క్రమంలో కళా వెంకట్రావుకు సీటు ఇస్తారా? లేదంటే వేరే కొత్త వ్యక్తిని పరిచయం చేస్తారా? అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న కిరణ్ కుమార్ కు మరోసారి సీటు వస్తుందా? లేదా? అనేదానిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ రెండు పార్టీల తరఫున రాబోయే ఎన్నికల సమరం కూడా హోరాహోరీగా జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+