174 నియోజకవర్గాలు ఒక ఎత్తు.. ఇదొక్కటే మరో ఎత్తు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణాన హోరాహోరీగా పోరాడేందుకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి. జనసేన పార్టీతో పొత్త ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం 94 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా, తనకు కేటాయించిన 24 నియోజకవర్గాల్లో జనసేన ఐదుగురు అభ్యర్థులను ప్రకటించింది.
మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. బీజేపీ కలిసివస్తే ఈ పార్టీతోపాటు టీడీపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడనున్నాయి. ఈ మూడు పార్టీల కూటమిని ఎదుర్కొనేందుకు వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తోంది.

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన ఎస్సీ నియోజకవర్గం రాజాం. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసిన కంబాల జోగులు విజయం సాధించారు. టీడీపీ తరఫున పోటీచేసిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ పై 16,848 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కూడా జోగులు టీడీపీ అభ్యర్థిని కావలి ప్రతిభాభారతిపై 512 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన కొండ్రు మురళీమోహన్ టీడీపీ అభ్యర్థి కావలి ప్రతిభాభారతిపై 27,133 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 నాటికి ఎస్సీ నియోజకవర్గంగా మారింది.

గతంలో ఇది జనరల్ నియోజకవర్గంగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. 1983లో పార్టీ ఆవిర్భావం నుంచి 1994 ఎన్నికలు మినహా అన్ని ఎన్నికల్లో 2004 వరకు కమిడి కళా వెంకట్రావు 5సార్లు విజయం సాధించారు.
వైసీపీ తరఫున కంబాల జోగులకే సీటు దక్కుతుందా? టీడీపీ నుంచి ఎవరు పోటీచేయనున్నారు? అనే ఉత్కంఠ నియోజకవర్గంలో కొనసాగుతోంది. రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో వైసీపీ ఉంది. కూటమిగా ఏర్పాటై ఘనవిజయం సాధిస్తామనే ధీమాలో టీడీపీ ఉంది. విజయం ఏ పార్టీని వరిస్తుందో చూడాలి.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications