మీతో జాగ్రత్తగా ఉండాలి, జగన్ గట్టిగా మాట్లాడితే ఏదేదో రాస్తారు: శ్రీకాంత్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియా పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీతో చాలా జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. మేం ఒకటి చెబితే, ప్రజల్లోకి మరోలా వెళ్తుందని వ్యాఖ్యానించారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియా పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీతో చాలా జాగ్రత్తగా ఉండాలని వ్యాఖ్యానించారు. మేం ఒకటి చెబితే, ప్రజల్లోకి మరోలా వెళ్తుందని వ్యాఖ్యానించారు.
బీఏసీ సమావేశానికి వైసిపి అధనేత జగన్ వెళ్లకపోవడానికి ప్రత్యేక కారణమంటూ లేదని చెప్పారు. ఆయన తరఫున మేమంతా వెళ్లామని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. జగన్ వచ్చి గట్టిగా ఏదైనా ప్రశ్నిస్తే మీరు ఏదేదో రాసేస్తారని, ఎందుకీ ఇబ్బందులు అన్నారు.

మీడియా పాయింట్ ఖాళీ లేదు
సమావేశాల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ ఉదయం నుంచే వివిధ పార్టీల ఎమ్మెల్యేలతో కిక్కిరిసిపోయింది. గవర్నరు ప్రసంగానికి ముందే టిడిపి, వైసిపిల నుంచి వరుసగా ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడారు. చాలామంది అవకాశం కోసం వేచి చూడాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications