Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్: టీటీడీ తరహాలో స్థానికులకు బిగ్ ఆఫర్

Srisailam temple: ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలంలో వెలసిన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు కల్పించే సౌకర్యాలు, స్పర్శ దర్శనం టికెట్లకు సంబంధించిన అంశాలపై ఆలయ పాలకమండలి దృష్టి సారించింది. దీనిపై రూపొందించిన పలు ప్రతిపాదనలను ఆమోదించింది. వీఐపీ బ్రేక్ దర్శనం, తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో స్థానికులకు స్పర్శదర్శన భాగ్యాన్ని కల్పించడం వంటివి ఇందులో ఉన్నాయి.

గతంలో భక్తుల సూచనల మేరకు స్పర్శ దర్శనం మధ్యాహ్నం స్లాట్‌ను కూడా ఆలయ అధికారులు పునరుద్ధరించిన విషయం తెలిసిందే. శని, ఆది, సోమవారాల్లో మధ్యాహ్నం కూడా భక్తులు మల్లికార్జునుడిని స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఈ మూడు రోజులు మధ్యాహ్నం మల్లన్న స్పర్శదర్శనం చేసుకునే వారికి ఆన్ లైన్‌లో 350 టికెట్లు, కరెంట్ బుకింగ్‌లో 200 టికెట్లు అందుబాటులో ఉంచారు.

Srisailam Trust Board takes key decisions

ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను జారీ చేయడానికి ఏర్పాటు చేసిన కరెంట్ బుకింగ్ విధానానికి బదులుగా ఆన్‌లైన్ వ్యవస్థను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆర్జిత సేవ, స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారు ఆన్‌లైన్‌లో తాము బుక్ చేసుకున్న టికెట్ల కాపీని దర్శన సమయంలో అధికారులకు చూపించాల్సి ఉంటుంది. వాటిని స్కాన్ చేసి, సదరు భక్తుడి వివరాలు సరిపోలిన తరువాతే ఆర్జిత సేవ, స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తారు. భక్తులు తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డును వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.

ఇక 150 రూపాయల శీఘ్ర దర్శనం, 300 రూపాయల అతి శీఘ్ర దర్శనం టికెట్లు మాత్రం ఆన్‌లైన్‌తో పాటు కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తారు. కరెంట్ బుకింగ్ ద్వారా కూడా భక్తులు వాటిని పొందవచ్చు. శీఘ్ర దర్శనం, అతి శీఘ్రదర్శనం టికెట్లల్లో 30 శాతం ఆన్‌లైన్ బుకింగ్ కోసం కేటాయించారు. మిగిలిన 70 శాతం టికెట్లను కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేస్తారు.

తాజా నిర్ణయాలు..

ఇప్పుడు తాజాగా శ్రీశైలంలో ఛైర్మన్ రమేష్ నాయుడు అధ్యక్షతన దేవస్థానం పాలక మండలి సమావేశమైంది. పలు కీలక ప్రతిపాదనలను ఆమోదించింది.

  • 50 కోట్ల రూపాయలతో దేవస్థానం ఉద్యోగుల కోసం సున్నపెంటలో నిర్మించిన స్టాఫ్ క్వాటర్స్ కు సిబ్బందిని తరలించే ప్రక్రియ వేగవంతం చేయడంపై ఇందులో సభ్యులు చర్చించారు.
  • తిరుమల తిరుపతి తరహాలో నెలలో ఒక రోజు స్థానికులకు స్పర్శ దర్శన భాగ్యం కల్పించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను పాలక మండలి ఆమోదించింది.
  • అలాగే- 500 రూపాయల వీఐపీ బ్రేక్ టికెట్ తీసుకున్న భక్తులకు ఒక లడ్డు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు.
  • ఆలయ భద్రత, నకిలి టికెట్లు దళారుల దర్శనాల విషయంలో విజిలెన్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళెందుకు ప్రతిపాదనలు చేయాలని పాలకమండలి తీర్మానించింది.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+