ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాట మార్చం, విభజన జరగదు: విజయమ్మ మొర!

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma
ఖమ్మం: తాను ఎప్పుడు మాట మార్చలేదని, మనస్సాక్షిగా చెబుతున్నానని రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గురువారం అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఆమె వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

తాను బాధితులను పరామర్శించి, పలకరించడానికే వచ్చానని ఆటంకాలు సృష్టించవద్దని తెలంగాణవాదులకు విజయమ్మ విజ్ఞప్తి చేశారు. తాను, తమ పార్టీ విభజనపై ఎప్పుడు మాట తప్పలేదన్నారు. ఒకే నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. విభజన విషయంలో తండ్రిలా వ్యవహరించాలని తాము కేంద్రానికి తెలిపామన్నారు.

రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోదాన్నారు. దివంగత వైయస్ విగ్రహాలు ధ్వంసం చేశారు కానీ ప్రజల హృదయాల నుండి ఆయనని తీయలేరన్నారు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. విభజనపై తమ నిర్ణయం ఎప్పుడు మారలేదు, మారదన్నారు. మూడు ప్రాంతాలకు సమానంగా న్యాయం జరగాలని అందుకే సమైక్యం అంటున్నామన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధిని తమ పార్టీ కాంక్షిస్తోందన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తూతూమంత్రంగా వరద బాధితులను పరామర్శించారని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ చేసే ప్రకటనలు ధైర్యాన్ని ఇచ్చేలా లేవన్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని చెప్పారు.

విజయమ్మను అఢ్డుకున్న పోలీసులు

పైనంపల్లి వద్ద విజయమ్మను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విజయమ్మ, కార్యకర్తలు రోడ్డు పైన బైఠాయించారు.

English summary
YSR Congress Party honorary president YS Vijayamma said on Thursday that AP will not divide.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X