నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Gangamma in Pyderu : పైడేరు వాగులో అద్భుత దృశ్యం... సాక్షాత్తు గంగమ్మ తల్లే తరలివచ్చింది...

|
Google Oneindia TeluguNews

నెల్లూరు జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కొడవలూరు మండలం గండవరం గ్రామంలోని పైడేరు వాగులో ఓ విగ్రహం ప్రత్యక్షమైంది. భారీ వర్షాలకు వరద ప్రవాహంలో కొట్టుకొచ్చిన విగ్రహం... అచ్చు ఎవరో వాగులో ప్రతిష్ఠించినట్లుగా ఉండిపోయింది. అంత వరదలోనూ విగ్రహం అక్కడి నుంచి కదలకపోవడం గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లే తమ గ్రామానికి తరలివచ్చిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మొదట గండవరం గ్రామానికి చెందిన కొంతమంది పిల్లలు ఆ విగ్రహాన్ని గుర్తించారు. విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో అంతా అక్కడికి క్యూ కట్టారు. వాగు మధ్యలో ప్రతిష్ఠించినట్లుగా ఉన్న విగ్రహాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. గ్రామంపై కరుణ కటాక్షాలు కురిపించేందుకు ఆ చల్లని తల్లి వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో ప్రసిద్ధ ఉదయకాలేశ్వర స్వామి ఆలయం ఉండటంతో... ఆ పరమ శివుడిని వెతుక్కుంటూ గంగమ్మ తల్లి గండవరం చేరిందని అంటున్నారు.అంతటి వరద ప్రవాహంలోనూ ఆ విగ్రహం ఇంచు కూడా కదలకపోవడం ఆ తల్లి మహిమనేనని అభిప్రాయపడుతున్నారు.

statue of gangamma idol in pyderu vaagu in nellore district

గ్రామస్తుల మాట ఎలా ఉన్నా ఆ విగ్రహం ఎక్కడినుంచి వచ్చిందన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఎగువ నుంచి వస్తున్న వరదలో విగ్రహం కొట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా వాగులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైందని గ్రామస్తులు సంతోషపడుతున్నారు.

statue of gangamma idol in pyderu vaagu in nellore district
English summary
An interesting incident took place in Nellore district. An idol was found in the Paideru river in Gandavaram village of Kodavalur zone. The statue was washed away in the floodwaters due to heavy rains.People saying it as goddess Gangamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X