ArcelorMittal Nippon Steel: ఏపీకి అంతర్జాతీయ స్టీల్ దిగ్గజం-నేడు కీలక ప్రకటన..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున పెట్టుబడుల కోసం చేస్తున్న ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తున్నాయి.
ఇందులో భాగంగా స్టీల్ దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ జపాన్ కు చెందిన మరో దిగ్గజ సంస్థ నిప్పన్ తో కలిసి రాష్ట్రంలో ఏకంగా రూ.70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఇవాళ సీఎం చంద్రబాబుతో ఆయా కంపెనీల ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు.

ఉత్తరాంధ్రలోని అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ సంయుక్తంగా పెట్టే ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన తొలి దశ పెట్టుబడి రూ.70 వేల కోట్లపై చర్చించేందుకు ఇవాళ సీఎం చంద్రబాబుతో సంస్ద ప్రతినిధులు భేటీ కానున్నారు. అనంతరం సీఎం చంద్రబాబు సంస్థ ప్రతినిధులతో కలిసి ఉమ్మడిగా ఓ ప్రకటన విడుదల చేయనున్నారు. అనకాపల్లిలో ఈ స్టీల్ ప్లాంట్ రాకతో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యామ్నాయం కూడా లభించే అవకాశం ఉంది.
ఇవాళ ప్రకటన తర్వాత జనవరిలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంఖుస్థాపన కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అనకాపల్లి బల్క్ డ్రగ్ పార్కు దగ్గర 2 వేల ఎకరాలతో పాటు విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో నక్కపల్లి దగ్గర భూముల్ని కలుపుకుని మొత్తం 5 వేల ఎకరాలు సంస్థకు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ప్లాంట్ తొలి దశ పూర్తయితే 20 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని, అంతకు మించి పరోక్షంగా అనుబంధ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications