రైళ్లపై రాళ్లేస్తే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా?
రైళ్లపై రాళ్లు రువ్వే సంఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వాస్తవానికి రైల్వే చట్టాలే కఠినంగా ఉంటాయి. అయినప్పటికీ కొందర దుండగులు రైళ్లపై రాళ్లదాడికి పాల్పడుతున్నారు. దీనివల్ల ప్రయాణికులకు గాయాలవడంతోపాటు రైల్వే ఆస్తులకు నష్టం కలుగుతోంది. ఇటీవల వందే భారత్ రైళ్లపై రాళ్లతో కొన్నిచోట్ల దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో భారతీయ రైల్వే కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం5 సంవత్సరాల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. రాళ్లదాడికి పాల్పడవద్దని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులతోపాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కోరుతోంది.
కాజీపేట- ఖమ్మం, కాజీపేట- భువనగిరి, ఏలూరు- రాజమండ్రి వంటి సమస్యాత్మక విభాగాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లను కొందరు దుండగులు లక్ష్యంగా ఎంచుకున్నారు. 2023 జనవరి నుంచి రైళ్లపై దాడి వంటి ఘటనలు 9 జరిగాయి. ఆస్తులు దెబ్బతినడంతోపాటు నడుస్తున్న రైళ్లను రీ షెడ్యూల్ చేయాల్సి వచ్చింది. ఒక సంఘటనలో రాళ్లు తగిలి ప్రయాణికుల తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులకు పాల్పడుతున్నవారెవరు? అనే కోణంలో ఆర్ ఫీఎఫ్ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటివరకు 39 మంది నేరస్తులను అరెస్ట్ చేశారు. దాడిచేసినవారిలో 6 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఉన్నారని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే శాఖ కోరుతోంది

ఎక్కడెక్కడైతే రాళ్లు రువ్వడానికి అవకాశం ఉంటుందో పరిశీలించి ఆయా ప్రాంతాల్లో ఆర్పీఎఫ్ సిబ్బందిని మొహరించారు. రాళ్ల దాడి వంటి ఘటన చోటుచేసుకుంటే 139 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. రైళ్లపై దాడులు జరగకుండా.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అవగాహన ప్రచారాలు నిర్వహిస్తోంది. ట్రాక్‌ల సమీపంలో ఉండే గ్రామాల సర్పంచ్‌లతో మాట్లాడి సమన్వయం చేసుకుంటోంది. ఆసక్తి ఉన్నవారిని గ్రామమిత్రగా ఎంపిక చేస్తోంది. రైల్వే ఆస్తులకు నష్టంతోపాటు ప్రయాణికులకు గాయాలయ్యే ఘటనలకు పాల్పడవద్దని, తమ పిల్లలకు తల్లిదండ్రులు కౌన్సెలింగ్ ఇవ్వాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications