తప్పిన పెను ప్రమాదం: అర్ధరాత్రి విశాఖ చేరిన అండమాన్ నౌక
విశాఖపట్నం: నగర తీరం నుంచి మంగళవారం బయల్దేరిన అండమాన్ నౌక్ 'హర్షవర్ధన్' నడి సముద్రంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ నౌక సురక్షితంగా మళ్లీ విశాఖ తీరానికి చేరుకుంది. దీంతో నౌకలోని మొత్తం 600మంది ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులలో ఏపీ వారే ఎక్కువగా ఉన్నారు.
సాంకేతిక లోపం కారణంగా నడి సముద్రంలో నిలిచిన అండమాన్ హర్షవర్ధన నౌకను మంగళవారం అర్ధరాత్రి విశాఖ తీరానికి తీసుకొచ్చారు. సముద్రంలోనే లోపాన్ని సరిదిద్దేందుకు సాంకేతిక నిపుణులు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాకపోవడంతో వెనక్కి తీసుకురావడం జరిగిందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఆ నౌక విశాఖ తీరంలోనే ఉంది. దీంతో ప్రయాణికులు కూడా పోర్టులోనే పడిగాపులు గాస్తున్నారు. బుధవారం ఉదయం ప్రయాణికులకు అధికారులు అల్పాహారాన్ని అందించారు. అయితే, తమ ప్రయాణం ఎప్పుడో చెప్పలేదని ప్రయాణికులు వాపోతున్నారు.
పోర్టులోనే హర్షవర్ధన నౌకను బాగు చేసిన అనంతరం అండమాన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోర్టుకు చేరుకున్న జాయింట్ కలెక్టర్ పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. సాంకేతిక నిపుణులు నౌకను బాగు చేసే పనిలో ఉన్నారని చెప్పారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications