పాదయాత్రలో జగన్ అభిమానిని చితకబాదారు, బెదిరించినా సీఎం రమేష్ గ్రామంలో నీరాజనం
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు విరామం అనంతరం శనివారం తిరిగి తన ప్రజా సంకల్ప యాత్రను చేశారు. ఐదో రోజు పాదయాత్ర ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో జరిగింది. ఈ సందర్భంగా జగన్ సీఎం
కడప: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు విరామం అనంతరం శనివారం తిరిగి తన ప్రజా సంకల్ప యాత్రను చేశారు. ఐదో రోజు పాదయాత్ర ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల తదితర ప్రాంతాల్లో జరిగింది. ఈ సందర్భంగా జగన్ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు.
చదవండి: జగన్‌కు పులివెందుల నేత ఝలక్: మోసం చేశారని ఫిర్యాదు, 'తెలంగాణకు సీఎం షర్మిల'
వైయస్ గండికోట ప్రాజెక్టును 24 టీఎంసీల సామర్థ్యంతో తలపెట్టారని, చిత్రావతి, పైడిపాళెం జలాశయాలను నీటితో నింపాలని ఉద్దేశించారని జగన్ అన్నారు. శ్రీశైలంలో నిండుగా నీళ్లున్నా ప్రాజెక్టులకు నీళ్లివ్వని పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు.
చదవండి: అసెంబ్లీలో భజన చిరాకేస్తోంది!: టీడీపీపై సంచలనం, విష్ణు నోట జగన్ మాటలు

ఇలా వైయస్ భావించారు
పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని తీసుకొచ్చి ప్రాజెక్టుల్లో నింపాలని వైయస్ భావించి 90 శాతం పనులు పూర్తి చేశారన్నారు. ఇప్పటికీ వరద కాల్వ పనులు పూర్తికానందున నీటిని ఒడిసి పట్టుకోలేని దుస్థితిలో ఉన్నామన్నారు. చంద్రబాబుకు ఎన్నికలప్పుడే వాగ్దానాలు గుర్తుకు వస్తాయని, హామలు మరచి, ప్రజలను మోసగించటానికి అబద్దాలు చెబుతున్నారన్నారు.

రాజకీయ వ్యవస్థను మారుస్తా
చంద్రబాబు నయవంచక పాలనతో రాజకీయ వ్యవస్థపై ప్రజలలో నమ్మకం పోతోందని జగన్ అన్నారు. చెప్పిందే చేస్తాననే నమ్మకం, విశ్వసనీయత కలిగేలా రాజకీయ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తానని అన్నారు. ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు.

ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి
బాబు వస్తే జాబు, నిరుద్యోగ భృతి, కడపకు స్టీల్ ప్లాంటు, ఫుడ్ పార్కు, ఉర్దూ యూనివర్సిటీ, స్మార్ట్ సిటీ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో చంద్రబాబు చెప్పాలని జగన్ నిలదీశారు. అన్ని సామాజిక వర్గాలను కలిసేందుకు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనివి కూడా చేస్తానన్నారు.

అభిమానిని చితకబాదిన జగన్ రోప్ పార్టీ
కాగా, జగన్ పాదయాత్ర సందర్భంగా ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఓ అభిమానిని జగన్ రోప్ పార్టీ పోలీసులు చితకబాదారు. కడప జిల్లా పొట్లదుర్తి హైస్కూల్ సమీపంలో జగన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసేందుకు ఓ అభిమాని రోప్ దాటుకొని వెళ్లారు. పోలీసులు అతడికి కాలు అడ్డం పెట్టారు. దీంతో ఆ అభిమాని కిందపడ్డారు. అతను వాగ్వాదానికి దిగడంతో, కొట్టారు.

జగన్ పాదయాత్రకు వెళ్లొద్దని హెచ్చరిక
మరోవైపు, జగన్ పాదయాత్రకు వెళ్లవద్దని పొట్లదుర్తిలో ప్రజలకు టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారని, కానీ వారి మాటలు పక్కన పెట్టి ప్రజా సంకల్ప యాత్రకు జనాలు తరలి వచ్చారని చెబుతున్నారు.

సీఎం రమేష్ స్వగ్రామంలో ఇలా
జగన్ పాదయాత్రకు ఎవరూ వెళ్లవద్దని, తలుపులు వేసుకోవాలని స్థానిక నేతలు హెచ్చరించారట. కానీ వారి మాటలకు సరేనని చెప్పిన జనాలు, ఆ తర్వాత జగన్ పాదయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొన్నారని చెబుతున్నారు. కాగా, పొట్లదుర్తి టీడీపీ ఎంపి రమేష్ స్వగ్రామం.

రమేష్ గ్రామంలో జగన్‌కు నీరాజనం
పొట్లదుర్తిలో జగన్‌కు జనాలు నీరాజనాలు పలికారు. పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఎక్కడ చూసినా జనసందేహం కనిపించింది. భవనాల పైకి ఎక్కి మరీ జగన్‌ను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.












Click it and Unblock the Notifications