జగన్‌కు పులివెందుల నేత ఝలక్: మోసం చేశారని ఫిర్యాదు, 'తెలంగాణకు సీఎం షర్మిల'

Posted By:
Subscribe to Oneindia Telugu

పులివెందుల: అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ, ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ శుక్రవారం షాకిచ్చింది. ఆయనపై ఫిర్యాదు చేసింది.

సభలకు, పెళ్లిళ్లకు వచ్చే వారు ఓట్లు వేయరు, వైసిపి లేని అసెంబ్లీ బాగుంది: ఆదినారాయణరెడ్డి

జగన్ ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరయ్యేందుకు ఆయన శుక్రవారం విరామం తీసుకున్నారు. మరోవైపు, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

 జగన్ తీరును తప్పుబడుతున్న పార్టీలు

జగన్ తీరును తప్పుబడుతున్న పార్టీలు

జగన్, వైసీపీ నేతలు అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరుగుతోంది. టీడీపీతో పాటు కాంగ్రెస్, ఇతర పార్టీలు కూడా జగన్ తీరును తప్పుబడుతున్నాయి. ప్రజా సమస్యలు వినిపించేందుకు గెలిపిస్తే బహిష్కరించడం సరికాదంటున్నారు.

 జగన్‌పై పులివెందులలో ఫిర్యాదు

జగన్‌పై పులివెందులలో ఫిర్యాదు

ఈ నేపథ్యంలో పులివెందుల టీడీపీ నేత రాంగోపాల్ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌పై ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన తన ఫిర్యాదు ఇచ్చారు.

 జగన్‌పై కేసు నమోదు చేయండి

జగన్‌పై కేసు నమోదు చేయండి

జగన్ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించి పులివెందుల ప్రజలను మోసం చేసారని అందులో రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 కింద ఆయనపై ఫిర్యాదు చేసిన ఆయన, కేసు నమోదు చేయాలని కోరారు.

 అసెంబ్లీ లాబీల్లో జగన్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య చర్చ

అసెంబ్లీ లాబీల్లో జగన్‌పై మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య చర్చ

అసెంబ్లీ లాబీల్లో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య చర్చ జరిగింది. పాదయాత్రకు జగన్ అనుమతి తీసుకున్నట్లే, ముద్రగడ కూడా తీసుకుంటే ఏమయిందని, అసలు ఆయనకు పాదయాత్ర చేసే ఉద్దేశ్యం లేనట్లుగా ఉందని హోంమంత్రి చినరాజప్ప అన్నారు.

 మనకు ఇబ్బంది ఏమీ లేదు

మనకు ఇబ్బంది ఏమీ లేదు

పాదయాత్ర మధ్యలో జగన్ కోర్టుకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో ఆయన అవినీతిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని కళా వెంకట్రావు అన్నారు. జగన్ పాదయాత్ర చేసినా మనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎమ్మెల్యే వర్మ అన్నారు.

 తెలంగాణకు సీఎం షర్మిల, రాష్ట్రపతి విజయమ్మ అంటారేమో

తెలంగాణకు సీఎం షర్మిల, రాష్ట్రపతి విజయమ్మ అంటారేమో

పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చిన జగన్, ప్రస్తుతం అత్తగారింటికి (సీబీఐ కోర్టు) వెళ్లారని మంత్రి ఆదినారాయణ లాబీల్లో అన్నారు. ఏపీకి కాబోయే సీఎం తానే అంటూ జగన్ ప్రచారం చేసుకుంటున్నారని, ఆయనను ఇలాగే వదిలేస్తే తెలంగాణకు షర్మిల సీఎం అవుతుందని, విజయమ్మ రాష్ట్రపతి అవుతారని చెబుతారని ఎద్దేవా చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam Party leader Ram Gopal Reddy complaint against YSR Congress party chief YS Jaganmohan Reddy in Pulivendula.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి