బంగారంపై పెట్టుబడి రిస్కీ ఛాలెంజ్
నేడు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో బలహీనమైన సెంటిమెంట్ ఉన్నప్పటికీ, దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో బంగారం ధరలు స్వల్పంగా ఎగబాకాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ద్రవ్యోల్బణం పెరిగి వడ్డీ రేట్లు మరింత అధికంగా ఉంటాయనే ఆందోళనలు దీనికి కారణం అయ్యాయి. సురక్షిత పెట్టుబడి వైపు మొగ్గు చూపడాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ హెచ్చుతగ్గులు పెట్టుబడిదారులను గందరగోళానికి గురి చేస్తోన్నాయి.
ఆగస్టు ఫ్యూచర్స్ కాంట్రాక్టుల కోసం ఎంసీఎక్స్ లో బంగారం ధర గత ముగింపు స్థాయి 1,59,346 రూపాయలతో పోలిస్తే 0.06 శాతం మేర పెరిగింది. 10 గ్రాములకు 1,59,447 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా జూలై ఫ్యూచర్స్ కాంట్రాక్టుల కోసం ఉద్దేశించిన వెండి ధర కిలోకు రూ. 2,66,707 వద్ద ముగియగా.. నేడు 0.01 శాతం తగ్గి 2,66,668 రూపాయల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈ ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ధర రూ. 24 పెరిగి రూ. 1,59,370 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర రూ. 491 తగ్గి రూ. 2,66,216 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు పడిపోయాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో ముడి చమురు ధరలు పెరిగాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధికంగానే ఉంటాయనే భయాలను మరింత బలపరిచింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ధర 0.2 శాతం తగ్గి ఔన్స్‌కు 4,476.50 డాలర్ల వద్ద నిలిచింది. ఆగస్టు డెలివరీ కోసం యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం తగ్గి 4,504.40 డాలర్ల వద్ద చేరాయి. స్పాట్ వెండి ధర 0.5 శాతం తగ్గి ఔన్స్‌కు 74.73 డాలర్లుగా నమోదైంది.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,818, 22 క్యారెట్లు - రూ. 14,500, 18 క్యారెట్లు - రూ. 12,180
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,622, 22 క్యారెట్లు- రూ. 14,320, 18 క్యారెట్లు - రూ. 11,717
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,622, 22 క్యారెట్లు- రూ. 14,320, 18 క్యారెట్లు - రూ. 11,717
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,622, 22 క్యారెట్లు- రూ. 14,320, 18 క్యారెట్లు - రూ. 11,717
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,622, 22 క్యారెట్లు- రూ. 14,320, 18 క్యారెట్లు - రూ. 11,717
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,622, 22 క్యారెట్లు- రూ. 14,320, 18 క్యారెట్లు - రూ. 11,717

Click it and Unblock the Notifications