అసెంబ్లీలో భజన చిరాకేస్తోంది!: టీడీపీపై సంచలనం, విష్ణు నోట జగన్ మాటలు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు శుక్రవారం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే.

  After ChandraBabu Naidu Who Is the key person In TDP


  పవన్ కళ్యాణ్ కూడా, నేను గెలిస్తే: 'అమరావతి'పై జగన్ ఓపెన్ ఆఫర్, మోడీ-బాబు పొత్తుపై

  ఈ సమావేశాలకు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గైర్హాజరయింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోనందుకు నిరసనగా సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది.

  విష్ణు కుమార్ సంచలన వ్యాఖ్యలు

  విష్ణు కుమార్ సంచలన వ్యాఖ్యలు

  ఈ నేపథ్యంలో ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో అధికార తెలుగుదేశం, మిత్రపక్షం బీజేపీలు మాత్రమే ఉన్నాయి. దీనిపై విష్ణు కుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

   భజన శృతి మించొద్దు, నిద్ర వస్తోంది

  భజన శృతి మించొద్దు, నిద్ర వస్తోంది

  అసెంబ్లీలో భజన ఓ మోస్తారుగా ఉంటే వినసొంపుగా ఉంటుందని, అది కాస్త శృతి మించితే చెవులు నొప్పులు వస్తాయని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోవడంతో నిద్ర వస్తోందన్నారు. స్పీకర్ కనీసం తమ వైపు చూడటం లేదన్నారు.

   వైసీపీ లేనప్పుడు మాకు ఇవ్వొచ్చు కదా

  వైసీపీ లేనప్పుడు మాకు ఇవ్వొచ్చు కదా

  అమృత పథకంపై బీజేపీకి మాట్లాడే అవకాశం సభలో ఇవ్వకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రధాన ప్రతిపక్షం లేనప్పుడు బీజేపీకైనా ఎక్కువ అవకాశం ఇవ్వాలన్నారు. స్పీకర్ తమను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు.

   ఎన్టీఆర్ నిధులు ఇస్తున్నారేమో అనుకుంటున్నారు

  ఎన్టీఆర్ నిధులు ఇస్తున్నారేమో అనుకుంటున్నారు

  ఎన్టీఆర్ గృహ నిర్మాణానికి ఎన్టీఆర్ నిధులు ఇస్తున్నాడని ప్రజలు భావిస్తున్నారని విష్ణు ఎద్దేవా చేశారు. కానీ మెజార్టీ నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయని తమకు సభలో చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు.

  విష్ణు నోట జగన్, వైసీపీ మాటలు

  విష్ణు నోట జగన్, వైసీపీ మాటలు

  కాగా, వైసీపీ కూడా సమావేశాల సమయంలో ఇలాంటి ఆరోపణలనే గతంలోను చేసింది. స్పీకర్ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, తమ వైపు చూడటం లేదని చెప్పేవారు. చంద్రబాబును పొగిడేందుకే సమయం కేటాయిస్తున్నారనే వారు. ఇప్పుడు అవే మాటలు విష్ణు కుమార్ చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  BJPLP Vishnu Kumar Raju unhappy with Andhra Pradesh assembly. He said we feeling like slept in AP Assembly.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి