టీఎంసీనేత ఇంట్లో కళ్ళు చెదిరిపోయే గోల్డెన్ ప్యాలెస్.. మంచం కూడా బంగారమే!

పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఓటమి పాలు కావడంతో, బిజెపి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత షమీమ్ అహ్మద్ నివాసంపై పోలీసులు జరిపిన దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మాల్దా జిల్లాలో టీఎంసీ నేత షమీమ్ అహ్మద్ ఇల్లు బయట నుంచి చూస్తే సాధారణ ఇల్లుగా కనిపించినా, లోపల భూగర్భంలో అత్యంత విలాసవంతమైన గోల్డెన్ ప్యాలెస్ దర్శనమిస్తుంది

గదిలో బంగారు మంచం... విలువైన వస్తువులు

పోలీసు సోదాల్లో సుమారు 250 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రూ.1.25 లక్షల నగదు లభ్యమయ్యాయి. ఈ రహస్య భూగర్భ గదిలో బంగారు మంచం ఏర్పాటు చేసి, విదేశీ దేశాల నుంచి తెప్పించిన ఖరీదైన పరుపులు, సోఫాలు, ఇంటీరియర్ వస్తువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు షమీమ్ అహ్మద్ ఆస్తులను భార్య పేరిట నమోదు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Luxury secret golden Palace Found in TMC Leader Shamim Ahmed house police shocked after finding golden bed

టీఎంసి నేత ఆస్తులు చూసి షాక్ అయిన పోలీసులు

అక్రమ ఆస్తులు, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై సోదాలు నిర్వహించిన పోలీసులు, అతని ఆస్తులు చూసి షాక్ అయ్యారు.సోదాల సమయంలో షమీమ్ అహ్మద్ ఇంట్లో లేడు.. పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. టీఎంసీ నేత ఇంట్లో దొరికిన విలాసవంతమైన వస్తువుల ఫోటోలు, బంగారు మంచం వైరల్ అవుతున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో అక్రమ సంపాదన

విపక్షాలు ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేస్తూ, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అక్రమ సంపాదన చేశారని ఆరోపిస్తున్నాయి. టీఎంసి హయంలో అవినీతి రాజ్యమేలింది అన్న చర్చ తాజాగా జరుగుతుంది. ఈ వ్యవహారంలో పోలీసులు మరిన్ని లోతైన విచారణలు చేపట్టనున్నారు. షమీమ్ అహ్మద్ ను అరెస్టు చేస్తే మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని అంటున్నారు.

ఉదయం 8.30నుండి సాయంత్రం 5గంటల వరకు బయటకు రావద్దన్న మంత్రి పొంగులేటి
ఉదయం 8.30నుండి సాయంత్రం 5గంటల వరకు బయటకు రావద్దన్న మంత్రి పొంగులేటి

గతంలోనూ భారీగా పట్టుబడిన నగదు

గతంలో కూడా పశ్చిమ బెంగాల్లో పలువురు రాజకీయ నాయకుల ఇళ్ళపైన దాడులు జరిగినప్పుడు భారీగా నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఇది అందరి దృష్టిని ఆకట్టుకునే విధంగా ఒక గోల్డెన్ ప్యాలెస్ రహస్య గదిగా ఉండడంతో ఇది మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+