అయ్యయ్యో..! జూ.ఎన్టీఆర్ హీరోయిన్ ఏంటి ఎలా అయిపోయిందేంటి..?
గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. "దేవర" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్ అందుకున్నాడు. రీసెంట్ గానే "వార్ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీలో హృతిక్ రోషన్ హీరోగా నటించగా.. ఎన్టీఆర్ కీలక పాత్రలో మెప్పించారు. కానీ ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "డ్రాగన్" అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. అలానే ఈ సినిమాలో మలయాళ సీనియర్ నటులు బిజూ మీనన్ కూడా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 11 2027న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే పైన కనిపిస్తున్న ఫొటోలో జూ.ఎన్టీఆర్ తో పాటు ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఆమె ఒకప్పుడు ఆయనతో పాటు నటించిన టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, భోజ్ పురి సినిమాల్లోనూ యాక్ట్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో మంచి సినిమాలే చేసినా ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. దీంతో క్రమంగా సినిమా ఇండస్ట్రీకి దూరమై బుల్లితెరపై సత్తా చాటింది. ఇంతకీ ఆమె ఎవరో ఇప్పుడైనా కనిపెట్టారా..?

ఆమె ఎవరంటే..?
మరి పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ను గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. ఆమె మరెవరో కాదు ఆ హీరోయిన్ సోనాలి జోషి. ఎన్టీఆర్ సరసన సుబ్బు మూవీలో నటించింది. 2001లో వచ్చిన ఓ మోస్తరుగా ఆడినా పాటలు మాత్రం చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఆ తర్వాత అభి, సందడే సందడి, నాన్న నేను అబద్ధం, రాంబాబు గాడి పెళ్ళాం సహా పలు సినిమాల్లో కనిపించింది. కానీ ఆ చిత్రాలన్నీ ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో అవకాశాలు తగ్గి ఇండస్ట్రీకి దూరమైంది.
ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఇంటికే పరిమితమైన ఈ నటి ఈ మధ్యన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన ఫ్యామిలీ ఫొటోస్, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. అయితే అప్పుడు చాలా స్లిమ్ గా కనిపించిన ఈ హీరోయిన్ ఇప్పుడు బొద్దుగా గుర్తుపట్టాలేనంతగా మారిపోవడంతో ఆమె ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపడుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు.













Click it and Unblock the Notifications