ఆ సీఎంకు వీసా ఇవ్వడానికి పాకిస్తాన్ గ్రీన్ సిగ్నల్: ఇక బంతి కేంద్రం కోర్టులో..!!

భారత్- పాకిస్తాన్ మధ్య దశాబ్దాల కాలంగా చిచ్చు రగులుతూనే వస్తోంది. 2019 నాటి పుల్వామా దాడి అనంతరం ఇది పతాక స్థాయికి చేరింది. గత ఏడాది పహల్గామ్ లో ఉగ్రవాద దాడి, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు.. ఈ రెండు దేశాల మధ్య అగాథాన్ని సృష్టించాయి. రెండు దేశాల మధ్య రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోయాయి. చివరికి క్రికెట్ కు కూడా పాకిందిది. భారత్- పాకిస్తాన్ ప్లేయర్లు ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితుల మధ్య పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. పాకిస్తాన్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ అంశంపై ఆ దేశ విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. భగవంత్ మాన్ పాకిస్తాన్‌కు పర్యటనకు రావాలనుకుంటే వీసా మంజూరు చేస్తామని తెలిపింది. లాహోర్‌లో జరగనున్న వరల్డ్ పంజాబీ కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి ఆయనకు ఆహ్వానం అందిన నేపథ్యంలో పాకిస్తాన్ ఈ వ్యాఖ్యలు చేసింది.

Pakistan says it would consider issuing CM Bhagwant Mann a visa for a Lahore Punjabi conference

భగవంత్ మాన్ ఈ పర్యటనకు వెళ్లడానికి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా భారత ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వీసా కోసం ఆయన దరఖాస్తు చేసుకుంటే.. దీన్ని సానుకూలంగా పరిశీలిస్తామని స్పష్టం చేసింది. నిబంధనలకు లోబడి వీసా మంజూరు చేస్తామని, లాహోర్ లో జరిగే వరల్డ్ పంజాబీ కాన్ఫరెన్స్ కు హాజరయ్యే ప్రతినిధులందరికీ భద్రత కల్పిస్తామని పేర్కొంది.

అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ బౌలర్- ఆ ఫార్మట్ కు గుడ్ బై
అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ బౌలర్- ఆ ఫార్మట్ కు గుడ్ బై

కర్తార్ పూర్ కారిడార్ వ్యవహారంలోనూ పాకిస్తాన్ సానుకూలంగా స్పందించిందీ సందర్భంగా. భారత వైపు నుంచి ఆంక్షలు తొలగితే కర్తార్ పూర్ గురుద్వారాను సందర్శించడానికి వచ్చే భారత యాత్రికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. త్వరలో నంకానా సాహిబ్‌లో జరగనున్న బాబా గురునానక్ 557వ జయంతి ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భారతీయులు యాత్రికులు వస్తారని పాకిస్తాన్ భావిస్తోంది.

ధన్‌తేరాస్ ధమాకా: రూ. వేల కోట్లు దాటిన పసిడి కొనుగోళ్లు: గిరాకీ వీటికే
ధన్‌తేరాస్ ధమాకా: రూ. వేల కోట్లు దాటిన పసిడి కొనుగోళ్లు: గిరాకీ వీటికే

కాగా.. వరల్డ్ పంజాబీ కాన్ఫరెన్స్.. ఈ నెల 27వ తేదీన జరుగనుంది. దీనికి హాజరుకావాల్సిందిగా తనకు ఆహ్వానం అందినట్లు భగవంత్ మాన్ ఇదివరకే వెల్లడించారు. సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పంజాబ్ ప్రాంతాల్లో ఒకే రకమైన సంస్కృతి, భాష ప్రాచుర్యంలో ఉన్నాయని గుర్తు చేశారు. పంజాబ్ నుంచి అనేకమంది ప్రముఖ రచయితలు, కవులు కూడా ఈ కార్యక్రమానికి వెళ్తున్నారని, కేంద్రం నుంచి అనుమతులు లభిస్తే తాను కూడా పాకిస్తాన్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

ఆయన రాకకు పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం వల్ల ఇక బంతి కేంద్రం కోర్టులో పడినట్టయింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్ణయమే ఇప్పుడు కీలకం కానుంది. దేశంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు విదేశీ పర్యటనలు చేయాలంటే కేంద్రం అనుమతి తీసుకోవల్సి ఉంటుందనే విషయం తెలిసిందే. ద్వైపాక్షిక సంబంధాల పరిస్థితి, భద్రతా కారణాల దృష్ట్యా కేంద్రం పాకిస్తాన్ పర్యటనలపై ఆచితూచి వ్యవహరిస్తుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+