వైసీపీని పక్కకు నెట్టి దూసుకొచ్చిన కాంగ్రెస్- ఆ మున్సిపాల్టీ లెక్క మార్చేసిన సీనియర్..!!
మున్సిపల్ ఫలితాల్లో అక్కడ కాంగ్రెస్ వైసీపీని పక్కకు నెట్టింది. కాంగ్రెస్ ఎట్టకేలకు ఖాతా తెరిచి తొలి విజయం నమోదు చేసుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల ఫలితాలను ప్రకటించారు. తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ మరి కొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చింది. అక్కడి కాంగ్రెస్ నేత ఎఫెక్ట్ తోనే ఈ ఫలితం వచ్చింది. కాగా.. అక్కడ వైసీపీని కాంగ్రెస్ దెబ్బ తీయటం ఆసక్తిగా మారింది.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఉనికి చాటులేకపోయిన కాంగ్రెస్ చీరాలలో సాధించిన ఓట్లు రాష్ట్ర వ్యాప్త చర్చకు కారణం అయ్యాయి. చీరాల మున్సిపాల్టీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి ఎరిచర్ల హనీ స్పందన 6,468 ఓట్ల మెజారిటీతో విజయం పొదారు. మురుసు తుఫాను కారణంగా ఈ నెల 3న జరగాల్సిన లెక్కింపు ప్రక్రియ వాయిదా పడింది. శుక్రవారం కౌంటింగ్ నిర్వహించారు. చీరాల మున్సిపాలిటీలోని 44 వార్డులకు మొత్తం 163 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాగా.. ఈ ఎన్నికల్లో ఛైర్మన్ అభ్యర్ధిగా టీడీపీ నుంచి హనీకి 21,883, వైసీపీ అభ్యర్ధి షెర్లీ 15,415, కాంగ్రెస్ అభ్యర్ధి దివ్య సుధాకర్ 11,025 ఓట్లు దక్కించుకున్నారు. కాగా.. 22 వార్డుల్లో టీడీపీ, 2 వార్డుల్లో జనసేన, ఒక్క వార్డులో బీజేపీ విజయం సాధించగా.. కాంగ్రెస్ 10 వార్డుల్లో గెలుపొందింది.

సత్తా నిరూపించుకున్న ఆమంచి
అయితే, ఇక్కడ వైసీపీ 8 వార్డులకే పరిమితం అయింది. ఇదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు కారణం అవుతోంది. కాగా.. ఇక్కడ పార్టీ కంటే ఆమంచి కృష్ణ మోహన్ ప్రభావం పని చేసింది. 2024 ఎన్నికల ముందు వైసీపీ నుంచి ఆమంచి కాంగ్రెస్ లో చేరారు. కాగా.. 2024 ఎన్నికల్లోనూ చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి 41,859ఓట్లు దక్కించుకున్నారు. మూడో స్థానంలో నిలిచారు. టీడీపీ నుంచి మాలకొండయ్య 72,700 ఓట్లు సాధించి 20,984 ఓట్లతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కరణం వెంకటేష్ కు 51,716 ఓట్లు దక్కాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కాంగ్రెస్ కు విజయం దక్కలేదు. చీరాలలో మాత్రమే దక్కటం వెనుక ఆమంచి ఎఫెక్ట్ గా విశ్లేషణలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications
