అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ బౌలర్- ఆ ఫార్మట్ కు గుడ్ బై

టీమిండియా ఫాస్ట్ బౌరల్ మహ్మద్ షమీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ ఫార్మట్ కు గుడ్ బై చెప్పాడు. ఏ తేదీన టెస్ట్ క్రికెట్ లో అడుగు పెట్టాడో.. అదే తేదీన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు ఓ భావోద్వేగ ప్రకటన చేశాడు. మొదటిసారి టెస్టు జెర్సీ ధరించినప్పుడు దేశం కోసం ఏదో సాధించాలనే ఏకైక లక్ష్యం మాత్రమే ఉండేదని, 13 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో సాధించిన ప్రతీ వికెట్, ఎదురైన ప్రతి పోరాటం తనకు ఎన్నో పాఠాలు నేర్పించాయని గుర్తుచేసుకున్నాడు.

టెస్ట్ మ్యాచ్‌లకు స్వస్తి చెప్పినప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా దూరం కావట్లేదు షమీ. వన్డే, టీ20 ఫార్మట్ కు అందుబాటులో ఉండనున్నాడు. వన్డేలు, టీ20ల్లో టీమిండియా తరఫున ఆడే అవకాశం కోసం ఎదురు చూస్తోన్నానని వెల్లడించాడు. దీనికి అనుగుణంగా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ ఆడతానని, బెంగాల్ జట్టు తరఫున బరిలోకి దిగుతానని చెప్పాడు.

Mohammed Shami announces his Retirement from Test Format same date as he made his Test debut

షమీ తన టెస్ట్ ప్రయాణాన్ని సరిగ్గా 2013 నవంబర్ 6న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రారంభించాడు. వెస్టిండీస్ పై మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అరంగేట్రం చేసిన సరిగ్గా 13 ఏళ్ల తర్వాత అదే తేదీన టెస్ట్ మ్యాచ్ తెర దించాడు. ఇప్పటివరకు 64 మ్యాచ్ లు ఆడిన షమీ.. 27.71 యావరేజ్ తో మొత్తం 229 వికెట్లు పడగొట్టాడు. సీమ్ పొజిషన్, రివర్స్ స్వింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించిన అతను ఆరు సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో అయిదేసి వికెట్ల ఘనత సాధించాడు.

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్
క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్

2023 జూన్‌లో ఆస్ట్రేలియాతో ఓవల్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్.. అతని చివరి మ్యాచ్ అయింది. టెస్ట్ ఫార్మట్ లో రీఎంట్రీ కోసం ఇన్నేళ్లు నిరీక్షించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతని ఎదురు చూపులు ఫలించలేదు. అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ వంటి యువ బౌలర్లకు ప్రాధాన్యత ఇస్తోంది బీసీసీఐ. దీంతో అతను తెరమరుగు కాకతప్పట్లేదు.

రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానం.. వందల కిలోమీటర్లు నడిపించింది
రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానం.. వందల కిలోమీటర్లు నడిపించింది

షమీ కేరీర్ ను ఒకరకంగా గాయాలు దెబ్బకొట్టాయి. 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన అనంతరం కాలి మడమకు సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత మోకాలి నొప్పితో సుదీర్ఘకాలం సతమతం అయ్యాడు. గాయాల నుంచి కోలుకుని 2025 జనవరిలో టీ20 సిరీస్ ద్వారా టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడాడు. ఐపీఎల్ తో పాటు బెంగాల్ రంజీ జట్టుకు కూడా ఆడుతూ తన ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ వచ్చాడు గానీ అప్పటికే ఆలస్యమైంది.

టెస్ట్ ఫార్మాట్‌తో తనకున్న బంధం మ్యాచ్ కే పరిమితం అయ్యేది కాదని, తన జీవితంలో అతి ముఖ్యమైన భాగమని ఈ సందర్భంగా పేర్కొన్నాడు షమీ. కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఎదురైనప్పుడు తనకు వెన్నుదన్నుగా నిలిచిన సహచర ఆటగాళ్లు, కోచ్‌లు, కుటుంబ సభ్యులు, కోట్లాది మంది భారతీయ అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు రుణపడి ఉంటానని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+