ఇంటికి తలుపులు లేని ప్రత్యేక గ్రామం.. చోరీ చేస్తే శని పట్టుకుంటాడు!
మన దేశంలో ఎన్నో విశేషాలు ఉన్న గ్రామాలు అనేకం ఉన్నాయి. అటువంటి గ్రామాలలో మహారాష్ట్రలోని శని సింగనాపూర్ ఒకటి. భారతదేశంలో విశ్వాసం, నిజాయితీకి ప్రతీకగా నిలిచిన ప్రత్యేక గ్రామంగా ఈ గ్రామానికి పేరు ఉంది. ఈ గ్రామం శని దేవుడికి అంకితం చేయబడింది. ఇక్కడి ప్రజలు శని దేవుని కటాక్షం ఎల్లప్పుడూ తమపై ఉంటుందని గాఢంగా నమ్ముతారు. అందుకే ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
శని సింగనాపూర్ ప్రత్యేకత ఇదే
ఈ గ్రామంలోని ఇళ్లకు తలుపులు ఉండవు అనేది అత్యంత విశేషం. చాలా చోట్ల కిటికీలకూ గ్రిల్స్ ఉండవు. ఇక్కడ పొరపాటున కూడా దొంగతనాలు జరగవని ప్రజలు నమ్ముతారు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేస్తే, శని దేవుడు తప్పు చేసిన వారిని శిక్షిస్తాడనే నమ్మకం ఇక్కడి జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ గ్రామంలో చాలా ఇళ్లకు ఇప్పటికి తలుపులు ఉండవని చెబుతారు.

శని దేవాలయం ప్రత్యేకత
ఇక్కడ ఉన్న శని దేవుడు చాలా ప్రత్యేకమైన దేవుడు. అత్యంత పవర్ఫుల్ శని ఆలయం ఇది అని చెబుతారు. ఇక్కడ శని దేవుడి విగ్రహం ఒక రాతి రూపంలో ఓపెన్ ప్రదేశంలో ఉంటుంది. ఆలయానికి పైకప్పు ఉండదు. భక్తులు నూనెతో అభిషేకం చేసి ప్రార్థనలు చేస్తారు. శని దేవుడి శక్తి ఈ గ్రామాన్ని రక్షిస్తుందని నమ్ముతారు.
దొంగతనం చెయ్యని గ్రామం.. అందుకే బ్యాంకులు తలుపుల్లేకుండా ప్రారంభం
శని సింగనాపూర్‌లో దొంగతనాలు చాలా అరుదుగా జరుగుతాయని చెబుతారు. ఈ గ్రామం నిజాయితీకి ప్రతీకగా నిలిచింది. అందుకే బ్యాంకులు కూడా ఒకప్పుడు తలుపుల్లేకుండా శాఖలు ప్రారంభించడం, నిర్వహించడం చేశాయని చెబుతారు. పర్యాటకంగా కూడా ఈ గ్రామానికి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రతి సంవత్సరం వేలాదిగా భక్తులు, పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తారు.
ఎన్నో విశేషాల శని సింగనాపూర్
ఇక్కడి ప్రజల సాంప్రదాయాలు, ప్రత్యేక జీవన విధానం, అన్నిటికంటే ఇక్కడ ఉన్న శనిదేవుడు పైన వారి విశ్వాసం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. ఎన్నో విశేషాలు ఉన్న శని సింగనాపూర్ ను ఒక్కసారైనా చుట్టి వచ్చేయండి. అక్కడ ప్రత్యేకత చూసి వారి జీవన విధానం తెలుసుకోండి.













Click it and Unblock the Notifications