పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్: మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా లోన్ ప్లాన్ చేసుకోండి

మీ నెలవారి వాయిదాలను సులభంగా అంచనావేయండి, మీకు సరిపోయే ఒక తిరిగిచెల్లింపు ప్రణాళికను ఎంచుకోండి.కొన్ని ఖర్చులను ముందే ప్రణాళిక చేసుకోవచ్చు. మరికొన్ని అనుకోకుండా వస్తాయి. తోబుట్టువు పెళ్ళి అకస్మాత్తుగా భారీ అవుతుంది. మీ బైక్ ప్రతివారం బ్రేక్ డౌన్ అవుతుంది. ఒక వైద్య చికిత్స మీకు జీతం వచ్చే వరకు వేచి ఉండదు. లేదా మీరు మీ ఇంటిని పునరుద్ధరించుకోవాలని, మీ కుటుంబముతో కలిసి విహార యాత్రకు వెళ్ళాలని లేదా మీ కెరీర్ ను మెరుగుపరచే ఒక ప్రొఫెషనల్ కోర్స్ లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవచ్చు.

ఇలాంటి పరిస్థితులలో, ఒక పర్సనల్ లోన్ ? దీర్ఘ-కాలిక పొదుపును బ్రేక్ చేయడం లేదా పెట్టుబడులు అమ్మే అవసరం పడకుండా మీకు ఒక ఆర్ధిక సహకారం అందించగలదు. కాని చాలామంది ఋణగ్రహీతలు ఆందోళన చెందే ఒక ప్రశ్న ఉంది - "ఈఎంఐ నా నెలవారి బడ్జెట్ కు అనుకూలంగా ఉంటుందా?"
ఇక్కడే ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగకరంగా ఉంటుంది.

personal-loan-emi-calculator-plan-your-monthly-budget-smartly-before-taking-a-loan

మీ నెలవారి తిరిగిచెల్లింపును ఊహించే బదులు, కాలిక్యులేటర్ క్షణాలలో మీకు స్పష్టమైన అంచనా ఇస్తుంది. మీరు ప్రతి నెల ఎంత చెల్లించవలసి ఉంటుంది అనేది మీరు చెక్ చేసుకోవచ్చు, వివిధ కాలపరిమితులను పోల్చి చూడవచ్చు మరియు మీకు అందుబాటులో ఉండే తిరిగిచెల్లింపు ప్లాన్ ను ఎంచుకోవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ తో, అర్హులైన ఋణగ్రహీతలు రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు ఉండే నిధులను, 12 నెలల నుండి 108 నెలల వరకు ఉండే తిరిగిచెల్లింపు కాలపరిమితులతో ఋణాలుగా పొందవచ్చు.అర్హులైన దరఖాస్తుదారులకు ఋణము త్వరిత ఆమోదము, కనీస డాక్యుమెమ్టేషన్, కొల్లాటరల్ అవసరం లేకుండా మరియు 24 గంటల పంపిణీతో అందించబడుతుంది.

ఒక పర్సనల్ లోన్ తీసుకునేముందు మీ ఈఎంఐ ని అర్థంచేసుకోవడం ఎందుకు ముఖ్యమైనది
ఒక పర్సనల్ లోన్ తక్షణ ఆర్ధిక అవసరాలను నెరవేర్చగలదు, కాని తిరిగిచెల్లింపు ప్రణాళిక కూడా ఋణము ఆమోదించబడటం మాదిరిగానే ముఖ్యమైనది.

చాలామంది వాళ్ళు ఎంత మొత్తము అప్పుగా తీసుకోగలరు అనేదాని గురించి ఆలోచిస్తారు. చాలా కొద్దిమంది మాత్రమే రాబోయే కొన్ని సంవత్సరాలలో రోజువారి ఖర్చులను ఈఎంఐ ఎలా ప్రభావితం చేస్తుంది అని చెక్ చేస్తారు.

జీతం వచ్చే ముందు ప్రతి నెల్ భారంగా అనిపించే ఈఎంఐ ఉన్న ఋణాన్ని తీసుకోవడం గురించి ఊహించుకోండి. పొదుపు చేసుకున్న మొత్తం తగ్గిపోతుంది. అత్యవసర నిధులు నిర్లక్ష్యం చేయబడతాయి. ఖర్చులు మరియు ఋణము తిరిగిచెల్లించడము రెండు పోటీపడతాయి.

ఈ పరిస్థితి రాకుండా ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ మీకు సహాయపడుతుంది. ఇది మీరు దరఖాస్తు చేసే ముందే భవిష్యత్తులో మీరు చెల్లించవలసిన మొత్తం గురించిన అంచనాను ఇస్తుంది.
పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ అంటే ఏమిటి, అది ఎలా సహాయపడుతుంది?
ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ అనేది మీరు మీ ఋణము కొరకు చెల్లించవలసిన నెలవారి వాయిదాలను అంచనా వేసే ఒక ఆన్లైన్ టూల్.

కాలిక్యులేటర్ మూడు ప్రాథమిక వివరాలను ఉపయోగిస్తుంది:
• ఋణ మొత్తము
• వడ్డీ రేటు
• ఋణ కాలపరిమితి

మీరు ఈ విలువలను ఎంటర్ చేయగానే, ఈ టూల్ ఆటోమాటిక్ గా మీ ఈఎంఐని లెక్కిస్తుంది.
క్లిష్టమైన సూత్రాలు లేదా మాన్యువల్ లెక్కింపులకు బదులు సత్వరమైన ఆర్ధిక ప్రణాళికకు సహాయపడే ఫలితాలు మీకు వెంటనే లభిస్తాయి.
ఉదాహరణకు:
• తక్కువ కాలపరిమితి ఈఎంఐని పెంచవచ్చు కాని చెల్లించే మొత్తం వడ్డీని తగ్గించవచ్చు .
• ఎక్కువ కాలపరిమితి ఈఎంఐని తగ్గించవచ్చు మరియు ప్రతి నెల తిరిగిచెల్లింపును సులభం చేస్తుంది.

ఒక నిర్ణయం తీసుకునేముందు రెండు పరిస్థితులలో పోల్చి చూసుకోవటానికి మీకు ఈ కాలిక్యులేటర్ సహాయపడుతుంది.ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ను సమర్థవంతంగా ఉపయోగించవచ్చు ఎలా
పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించడం చాలా సులభం.
దశ 1: ఋణ మొత్తాన్ని ఎంటర్ చేయండి
మీ ఆర్ధిక అవసరాల ఆధారంగా మీరు ఎంత ఋణాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోండి.
దశ 2: వడ్డీ రేటును ఎంటర్ చేయండి
మీ ఋణానికి వర్తిస్తుందని మీరు ఆశించే వడ్డీ రేటును ఎంటర్ చేయండి.
దశ 3: తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంచుకోండి
నిర్వహణీయ తిరిగిచెల్లింపుతో భరించదగిన ఈఎంఐలను సమతుల్యం చేసే ఒక కాలపరిమితిని ఎంచుకోండి.
దశ 4: మీ ఈఎంఐని సమీక్షించుకోండి

ఈ కాలిక్యులేటర్ తిరిగిచెల్లింపు వివరాలతో కలిపి మీ ఈఎంఐని తక్షణం చూపుతుంది.
మీకు సౌకర్యంగా ఉన్న తిరిగిచెల్లింపు కనుగొనే వరకు వేరువేరు విలువలతో మీరు ఈ ప్రక్రియను మళ్ళీ మళ్ళీ చేయవచ్చు.
మీ పర్సనల్ లోన్ ఈఎంఐని ప్రభావితం చేసే అంశాలు
మీ ఈఎంఐ యాదృచ్ఛికంగా నిర్ణయించబడదు. అనేక అంశాలు అంతిమ మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి.
ఋణ మొత్తము: మీరు అప్పుగా తీసుకునే మొత్తము మీ ఈఎంఐని నేరుగా ప్రభావితం చేస్తుంది. చాలా సందర్భాలలో అధిక ఋణ మొత్తము అధిక నెలవారి వాయిదాకు కారణం అవుతుంది. ఉదాహరణకు, తిరిగిచెల్లింపు కాలపరిమితి మరియు వడ్డీ రేటు ఒక్కటే అయినప్పుడు, రూ. 12 లక్షలకు ఉండే ఈఎంఐ కంటే రూ. 3 లక్షలకు ఈఎంఐ సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఋణము తీసుకునే ముందు, మీ ఆర్ధిక ఆవశ్యకత మరియు తిరిగి చెల్లింపు సామర్థ్యానికి సరిపోయే ఋణ మొత్తాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
వడ్డీ రేటు: మీ ఋణము యొక్క వ్యయాన్ని నిర్ణయించడములో వడ్డీ రేటు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అతి చిన్న వ్యత్యాసము కూడా మీ ఈఎంఐ మరియు మొత్తమ్మీది తిరిగిచెల్లింపు మొత్తం, రెండిని ప్రభావితం చేయవచ్చు. అర్హత, ఆదాయ వివరాలు మరియు ఋణ ప్రమాణము వంటి అంశాల ఆధారంగా బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ఏడాదికి 10% నుండి 30% వరకు ఉండే వడ్డీ రేట్లను అందిస్తుంది. ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించడం వలన మీరు వివిధ వడ్డీ రేట్లు ఎలా మీ నెలవారి తిరిగిచెల్లింపును ప్రభావితం చేస్తాయో అర్థంచేసుకోవచ్చు.
తిరిగిచెల్లింపు కాలపరిమితి: ఋణ కాలపరిమితి మీరు ఎంతకాలం ఋణాన్ని తిరిగిచెల్లించడం కొనసాగిస్తారు అనేది నిర్ణయిస్తుంది. బజాజ్ ఫినాన్స్ పర్సనల్ లోన్ తో, అర్హులైన ఋణగ్రహీతలు 12 నెలల నుండి 108 నెలల వరకు ఉంటే అనువైన తిరిగిచెల్లింపు కాలపరిమితుల నుండి ఎంచుకోవచ్చు. ఎక్కువగా ఉండే కాలపరిమితి సాధారణంగా ఈఎంఐ మొత్తాన్ని తగ్గిస్తుంది, తద్వారా మీ నెలవారి తిరిగిచెల్లింపు సులభం అవుతుంది. అయితే ఇది ఋణ కాలానికి చెల్లించే వడ్డీని కూడా పెంచుతుంది. మరొకవైపు, తక్కువ కాలపరిమితి ఈఎంఐని పెంచవచ్చు, కాని మొత్తం వడ్డీ వ్యయాన్ని తగ్గిస్తుంది. ఈఎంఐ స్థోమత మరియు తిరిగిచెల్లింపు కాలాల మధ్య సరైన సమన్వయం ఉండేలా చూసుకోవడం ముఖ్యం.
క్రెడిట్ ప్రవర్తన: మీ ఆర్ధిక ప్రొఫైల్ కూడా మీ ఋణ నియమాలు మరియు అర్హతను ప్రభావితం చేస్తుంది. ఋణదాతలు ఈ క్రింది అంశాలను సమీక్షించవచ్చు:
• తిరిగిచెల్లింపు చరిత్ర
• ప్రస్తుతం ఉన్న ఈఎంఐలు మరియు ఋణాలు
• ఆదాయ సుస్థిరత
• క్రెడిట్ స్కోర్ మరియు మొత్తం క్రెడిట్ ప్రవర్తన
క్రమశిక్షణ కలిగిన తిరిగిచెల్లింపు అలవాట్లు కలిగి ఉండడం మరియు క్రెడిట్ ను బాధ్యతాయుతంగా నిర్వహించడం కాలక్రమేణ ఆర్ధిక విశ్వసనీయతను మెరుగుపరచవచ్చు మరియు భవిష్యత్తులో ఋణాలు తీసుకునే అవకాశలకు సహాయపడవచ్చు.
బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ఎందుకు తెలివైన ఎంపిక?
ఒక పర్సనల్ లోన్ క్లిష్టమైనది కాకూడదు. ఈరోజు ఋణగ్రహీతలు వేగం, అనుకూలత మరియు సౌకర్యాల కోసం చూస్తున్నారు.
అనేక ఆర్ధిక అవసరాలకు బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ ప్రత్యేకమైనది అనడానికి కారణాలు:
• అనువైన ఋణ మొత్తాలు: అర్హులైన ఋణగ్రహీతలు వారి వారి ఆవశ్యకతల ఆధారంగా రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు ఉండే ఋణ మొత్తాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
• సుదీర్ఘ తిరిగి చెల్లింపు సౌలభ్యం: 108 నెలల వరకు పొడిగించగలిగే కాలపరిమితి ఋణగ్రహీతలకు నెలల తరబడి మరింత సౌకర్యవంతంగా తిరిగి చెల్లింపును విస్తరించడానికి సహాయపడుతుంది.
• త్వరిత ఆమోద ప్రక్రియ: ఖర్చులు అత్యవరం అయినప్పుడు, వారాల తరబడి వేచి ఉండటం కుదరకపోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ అర్హులైన దరఖాస్తుదారులకు సత్వర ఆమోదాన్ని మరియు 24 గంటలలోపు* పంపిణీని అందిస్తుంది.
కొల్లాటరల్ అవసరం లేదు: దరఖాస్తు చేసేటప్పుడు మీరు ఆస్తి, బంగారం లేదా ఇతర ఆస్తులను తనఖా పెట్టవలసిన పనిలేదు.
కనీస డాక్యుమెంటేషన్: అతితక్కువ పేపర్ వర్క్ అవసరాలతో ఈ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది, దానితో దరఖాస్తు అనుభవం సరళంగా ఉంటుంది.
ఆత్మవిశ్వాసముతో మీ ఋణాన్ని ప్రణాళిక చేసుకోండి
సరైన పర్సనల్ లోన్ మీరు ముఖ్యమైన జీవిత లక్ష్యాలను మీ దీర్ఘ-కాలిక ఆర్ధిక ప్రణాళికలను ఆటంకపరచకుండా నెరవేర్చుకొనుటకు సహాయపడుతుంది. కాని తెలివిగా ఋణము తీసుకోవడం తిరిగిచెల్లింపును స్పష్టంగా అర్థంచేసుకోవడముతో మొదలు అవుతుంది.
ఒక పర్సనల్ లోన్ ఈఎంఐ కాలిక్యులేటర్ ఉపయోగించడం అనేది ముందుగానే మీ నెలవారి వాయిదాలను అంచనా వేయుటకు, తిరిగిచెల్లింపు ఎంపికలను పోల్చి చూడటానికి మరియు మీకు ఆర్ధికంగా సౌకర్యంగా ఉండే ఋణాన్ని ఎంచుకొనుటకు సహాయపడుతుంది.

బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ తో, అర్హులైన ఋణగ్రహీతలు అనువైన ఋణ మొత్తాఉ, సుదీర్ఘ తిరిగిచెల్లింపు కాలపరిమితులు, త్వరిత ఆమోదము, కనీస డాక్యుమెంటేషన్ మరియు పూర్తిగా ఆన్లైన్ ప్రక్రియ అనే ప్రయోజనాలను పొందవచ్చు.
ఈరోజే మీ అర్హతను పరీక్షించండి మరియు మీ ఆర్ధిక లక్ష్యాలకు అనుకూలమైన పర్సనల్ లోన్ కొరకు నమ్మకంగా దరఖాస్తు చేయండి.
*నియమాలు మరియు నిబంధనలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+