చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న అల్లు అయాన్

సెలబ్రిటీలు సినిమాలు, యాడ్స్ ద్వారా సంపాదించినది తమవంతు సాయంగా పేదలకు పంచుతుంటారు. విపత్తు కాలంలో లేదా ఇతర ఆపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ ముందుంటారు. చాలాసార్లు కోట్లు సాయం చేసి తమ మంచితనం, దయాహృదయాన్ని చాటుకున్నారు. ఆ సాయం చేసే గుణాన్ని తమ పిల్లలకూ నేర్పిస్తున్నారు మన హీరోలు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియాలో ఎంతటి పాపులర్ హీరోనే మనకు తెలిసిందే. పుష్ప సిరీస్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అలాగే సాయం చేయడంలోనూ అల్లు అర్జున్ ఎప్పుడూ ముందుంటారు. అయితే తన తండ్రి బాటలోనే ఇప్పుడు అల్లు అయాన్ కూడా నడుస్తున్నాడు.

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్నాడు అల్లు అయాన్. ఎప్పుడూ తన సరదా మాటలతో, క్యూట్ ఎక్స్‌ ప్రెషన్స్‌ తో అభిమానులను అలరించే అయాన్‌ కు తన తండ్రి లాగే మంచి మనసు ఉందని నిరూపించాడు. చిన్న వయసులోనే గుర్రాన్ని దత్తత తీసుకుని అందరి ప్రశంసలు అందుకున్నాడు. రేస్ 2 ఫౌండేషన్ అనే సంస్థ నుంచి సిద్ధార్థ్ అనే పేరు కలిగిన గుర్రాన్ని అయాన్ అడాప్ట్‌ చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ సంస్థ తమ సోషల్ మీడియా ఖాతాలో అధికారికంగా వెల్లడించింది.

AlluAyaan Adopts a Horse Allu Arjun s Son Wins Hearts with Kind Act Internet Full of Praise Allu

ఈ మేరకు సంస్థ షేర్ చేసిన ఫోటోలో సిద్ధార్థ్ అనే పేరు అలాగే డోనర్ గా అల్లు అయాన్ పేరు ఉన్న బోర్డులు కనిపించాయి. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అభిమానులు అయాన్ మంచి మనసును ప్రశంసిస్తున్నారు. అయాన్ చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్నాడంటూ.. అయాన్ చేసిన పనికి అభినందనీయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా ఈ ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన నేపథ్యంలో ఈ విషయం మరింత వైరల్ గా మారింది. ఇక అల్లు అయాన్ కు జంతువుల పట్ల ప్రేమకు అందరూ మెచ్చుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+