IPL 2026: సీజన్ లో కెప్టెన్సీ కోల్పోతున్న తొలి ప్లేయర్ అతనే..? రేసులో వీళ్లు కూడా..!

ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) ప్లేఆఫ్ దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు జట్లు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాయి. మరో రెండు బెర్తుల కోసం ఇంకో నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. అలాగే టోర్నీలో చెత్త ఆటతీరు కారణంగా మరో రెండు జట్లు టోర్నీ నుంచి నిష్కృమించాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో చెత్త ప్రదర్శనతో నిరాశపర్చిన పలు జట్ల కెప్టెన్లపై వేటు పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఇందులో తొలి కెప్టెన్ ఎవరో కూడా ఖరారైంది.

టీ20 కెప్టెన్ సూర్యపై వేటు ? రేసులో ఆ ఇధ్దరు..! అతనికే ఛాన్స్ ?
టీ20 కెప్టెన్ సూర్యపై వేటు ? రేసులో ఆ ఇధ్దరు..! అతనికే ఛాన్స్ ?

ఈ సీజన్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ నిష్కృమించాయి. దీంతో ఈ రెండు జట్ల కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ పై వేటు తప్పేలా లేదు. వీరిద్దరి తర్వాత నిష్కృమణకు సిద్దంగా ఉన్న మరో జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ ఆజింక్యా రహానే పైనా వేటు పడేలా ఉంది. చివరిగా కేవలం 10 పాయింట్లు మాత్రమే సాధించి ప్లేఆఫ్ అవకాశాల్లేని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) కెప్టెన్సీపైనా కత్తి వేలాడుతోంది.

Axar Patel Set to Lose Delhi Capitals Captaincy these leaders also facing threaet
RCB vs KKR: సెంచరీతో చెలరేగిన కోహ్లీ: కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు?
RCB vs KKR: సెంచరీతో చెలరేగిన కోహ్లీ: కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు?

ఇందులో ముందుగా కెప్టెన్సీ కోల్పోయే ప్లేయర్ మాత్రం అక్షర్ పటేలే అని తెలుస్తోంది. ఈ సీజన్ లో ఢిల్లీ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్ అక్షర్ పటేల్‌ను తొలగించే అవకాశం ఉంది. అతని నాయకత్వం, బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తాయి. సహాయక సిబ్బందిని కూడా పూర్తిగా మార్చాలని యాజమాన్యం యోచిస్తోంది. స్వయంగా 32 ఏళ్ల అక్షర్ పటేల్ బ్యాట్‌తో ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 112.50 స్ట్రైక్ రేట్‌తో కేవలం 100 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ అక్షర్ 12 మ్యాచ్‌ల్లో కేవలం 36 ఓవర్లు మాత్రమే బౌల్ చేశాడు, అంటే సగటున మ్యాచ్‌కు మూడు ఓవర్లు. అతను 8.08 ఎకానమీ రేటుతో 10 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ తగినన్ని ఓవర్లు వేయడం లేదని పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అక్షర్ ను తప్పించబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+