దసరా పండుగ వేళ నిత్యావసరాల ధరల మోత!

దసరా పండుగ దగ్గరపడుతుండగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల్లో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. నిత్యావసరాల ధరలు పెరగటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా పండుగ సమయంలో కుటుంబాలు పిండివంటలు చేసుకుంటారు. నూనె, పంచదార, పప్పులు ఇలా అవసరం అయిననిత్యావసరాలు కొనుగోలు చేస్తారు.

అయితే ఈసారి ధరల మోత కారణంగా ఇళ్ల బడ్జెట్‌లు భారంగా మారాయి. సన్నబియ్యం కిలో రూ.82 వరకు చేరింది. 26 కిలోల బస్తా గతంలో రూ.1,500 ఉండగా ఇప్పుడు రూ.2,050కి పెరిగింది. కూరగాయల ధరలు సగటున 42 శాతం పెరిగాయి. టమాటా కిలో రూ.39, వంకాయ రూ.40 పలుకుతున్నాయి. కందిపప్పు కిలో రూ.145, మినపగుళ్లు రూ.135-145, శనగపప్పు రూ.95-105గా ఉన్నాయి. పంచదార రూ.75, బెల్లం రూ.80కి చేరాయి.

Dussehra Festival Price Hike Essential Commodity Rice Vegetables Prices Soar Ahead of Dussehra

జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష వంటి పొడిపళ్లు కూడా కిలోకి రూ.100 వరకు పెరిగాయి. పాల ధరలు లీటరుకు రూ.4 పెంచారు. నూనె ధరలు కూడా ఏమంత తక్కువగా లేవు. కిలో వేరు శనగ నూనె 185 రూపాయలు, సన్ ఫ్లవర్ నూనె 185 రూపాయలు, పామాయిల్ 155 రూపాయలుగా ఉంది. ఎల్‌నినో ప్రభావంతో పంటలు తగ్గుతాయనే అంచనాలతో వ్యాపారులు ముందే రేట్లు పెంచేశారు. కొత్త పంట ఇంకా రాకపోవడం, సరఫరా కొరత ఈ ధరల పెరుగుదలకు కారణం అవుతుంది. ఇదిలా ఉంటే వేరుశనగ ధరలు కిలో రూ.160-200కి చేరడంతో పల్లీ చట్నీ కూడా ఖరీదైంది.

జగనన్న కాలనీల ఇళ్లస్థలాలపై కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం.. 45 రోజుల్లోగా అలా చెయ్యాల్సిందే!
జగనన్న కాలనీల ఇళ్లస్థలాలపై కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం.. 45 రోజుల్లోగా అలా చెయ్యాల్సిందే!

ఒక్కో కుటుంబంపై నెలకు సగటున రూ.1,200 అదనపు భారం పడుతోంది. పండుగ సెలవులు అక్టోబర్ 10 నుంచి మొదలవుతుండటంతో డిమాండ్ మరింత పెరగొచ్చు. ప్రభుత్వం ధరల పై నిఘా పెట్టి, ధరలను నియంత్రించటానికి తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. స్టాకు విడుదల చేసే సమయంలో ధరలను చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సామాన్య ప్రజలు ఇప్పటికే ఖర్చులను తగ్గించుకుంటూ, అవసరమైనవి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. పండుగ వేళ ధరల మోతతో ఏమైనా వండుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+