రూ.12 కోట్లతో తొలి చేనేత సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్!

తెలంగాణలో చేనేత రంగాన్ని ఆదుకోవటం కోసం, నేత కార్మికులకు అండగా ఉండటం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. నేతన్నలకు ఆర్ధిక భరోసా కల్గించేలా కొత్త కార్యక్రమాలను చేపడుతుంది. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చేనేత రంగానికి కొత్త దశ మొదలైంది.

నారాయణపేటలో రాష్ట్ర చేనేత సహకార సంఘం టెస్కో రూ.12 కోట్లతో నిర్మించిన తొలి హ్యాండ్‌లూమ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభానికి సిద్ధమైంది. ఐదు ఎకరాల్లో పరిపాలన భవనం, శిక్షణ కేంద్రం, వీవింగ్, డైయింగ్, గార్మెంట్ యూనిట్లు, డిజైన్ స్టూడియో సిద్ధమయ్యాయి. సేల్స్ హబ్ కూడా త్వరలో పూర్తవుతుంది. నారాయణపేట చీరలు జీఐ ట్యాగ్ పొందినవి. చెక్‌డ్ డిజైన్, టెంపుల్ బోర్డర్లతో ప్రసిద్ధి.

Handloom Center of Excellence in Narayanpet with Rs 12 crores Telangana govt focus on Weaver Welfare

ఒక మగ్గంపై ఎనిమిది చీరలు ఒకేసారి నేసే సాంప్రదాయం ఉంది. అయినా తక్కువ వేతనాలు, మార్కెటింగ్ సమస్యలు నేతన్నలను ఇబ్బంది పెడుతున్నాయి. పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ నేతన్నలకు ఆదాయం చాలా తక్కువగా ఉంది. దీంతో వారికి ఆర్ధికంగా అండగా ఉండేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఈ కేంద్రం ద్వారా ఆధునిక మగ్గాలు, కొత్త డిజైన్లపై శిక్షణ ఇచ్చి, స్థానికంగా అమ్మకాలు, ఎగుమతులు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

చేనేత కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. నేతన్న భరోసా పథకం కింద జియో ట్యాగ్ మగ్గాలపై పనిచేసే నేతన్నలకు సంవత్సరానికి రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు అందుతున్నాయి. నేతన్న భద్రత బీమా పథకం ద్వారా మరణిస్తే రూ.5 లక్షలు అందుతాయి. నేతన్నకు చేయూత పథకంలో కార్మికులు 8 శాతం పొదుపు చేస్తే ప్రభుత్వం 16 శాతం జమ చేస్తుంది.

జగనన్న కాలనీల ఇళ్లస్థలాలపై కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం.. 45 రోజుల్లోగా అలా చెయ్యాల్సిందే!
జగనన్న కాలనీల ఇళ్లస్థలాలపై కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం.. 45 రోజుల్లోగా అలా చెయ్యాల్సిందే!

వ్యక్తిగత రుణాలు రూ.1 లక్ష వరకు మాఫీ చేస్తున్నారు. ప్రభుత్వ ఆర్డర్లు, యార్న్ సబ్సిడీ కూడా ఉన్నాయి. ఈ సెంటర్‌తో పాటు సంక్షేమ పథకాలు కలిసి నేతన్నల జీవన ప్రమాణాలు పెంచి, సాంప్రదాయ చేనేతను బలోపేతం చేస్తాయని అంచనా వేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే భవిష్యత్ లో నేతన్నలకు మార్కెటింగ్ సమస్య లేకుండా ప్రభుత్వం అండగా ఉండే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+