డాలర్ల కోసం పులుల్ని చంపుకున్నాం! యాడ్స్ ఇచ్చి మరీ పులి వేట.. ఇందిరా గాంధీ ఆర్డర్స్..?

నేడు ప్రపంచంలోనే పులుల సంరక్షణకు అత్యంత ఆదర్శవంతమైన దేశంగా భారత్ గుర్తింపు పొందింది. 'ప్రాజెక్ట్ టైగర్' ద్వారా అంతరించిపోతున్న పులుల సంఖ్యను పెంచి, అడవులకు పూర్వవైభవం తీసుకురావడంలో నూటికి నూరు శాతం విజయం సాధించింది. కానీ, మన దేశంలో అడవికి రాజుగా నిలిచే పులిని కాపాడుకోవడానికి పట్టిన సమయం ఎంత ఉందో.. అదే పులిని విదేశీయులకు వేటాడేందుకు అప్పగించిన విచారకరమైన చరిత్ర కూడా అంతే ఉంది. స్వాతంత్య్రం వచ్చిన ప్రారంభ దశాబ్దాల్లో డాలర్ల కోసం భారత ప్రభుత్వమే స్వయంగా విదేశీ పర్యాటకులను పిలిచి మరి పులులను వేటాడేలా ప్రోత్సహించింది. నేడు అక్టోబర్ మొదటి వారంలో 'వన్యప్రాణి వారోత్సవాలు' జరుపుకుంటున్న వేళ.. చరిత్ర పుటల్లో దాగి ఉన్న ఈ చేదు సత్యాన్ని ఒక్కసారి తిరగేస్తే అనేక దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వస్తాయి.

రూ. 150కి పులి.. రూ. 35కి చిరుత!

1957వ సంవత్సరంలో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన అటవీ నియమావళి నిబంధనలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ రోజుల్లో ఒక పులిని కాల్చి చంపడానికి ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కేవలం రూ. 150 మాత్రమే. అలాగే చిరుతపులిని వేటాడాలంటే రూ. 35, ఎలుగుబంటి లేదా దుప్పిని చంపడానికి రూ. 50, జింకలను వేటాడటానికి రూ. 30 ఫీజుగా నిర్ణయించారు. ఈ నిబంధనల ప్రకారం వేటగాళ్లకు లైసెన్సులు ఇవ్వడం, వేట బ్లాకులను కేటాయించడం, స్థానిక గైడ్లను సమకూర్చడం వంటివన్నీ అధికారికంగానే జరిగిపోయేవి. అప్పట్లో విదేశీ పర్యాటకులు తాజ్‌మహల్ చూసేందుకు మాత్రమే కాదు.. జిమ్ కార్బెట్ రాసిన 'మన్ ఈటర్స్ ఆఫ్ కుమావూన్' పుస్తకాల్లో చదివిన సాహసాలను ప్రత్యక్షంగా అనుభవించడానికి, పులి చర్మాన్ని ఒక జ్ఞాపికలా (ట్రోఫీ) తమ దేశానికి పట్టుకెళ్లడానికే భారత్‌కు క్యూ కట్టేవారు.

How India Courted American Hunters in 1950s The Untold History of Commercial Tiger Hunting Fees

అమెరికా పత్రికల్లో ఊరించిన ప్రకటనలు.. న్యూయార్క్‌లో ఆఫీసులు!

బ్రిటిష్ కాలం నుంచి సంక్రమించిన వేట సంస్కృతిని స్వాతంత్య్రం వచ్చాక కూడా భారత ప్రభుత్వం ఏమాత్రం ఆపలేదు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి విదేశీ డాలర్లు అవసరం కావడంతో, పర్యాటక శాఖ ద్వారా "విత్ గన్ అండ్ రాడ్ ఇన్ ఇండియా" పేరిట 136 పేజీల కలర్ బుక్‌లెట్‌ను విడుదల చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసింది. ప్రసిద్ధ అమెరికన్ పత్రికల్లో ప్రకటనలు గుప్పించడమే కాకుండా.. న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోలలో ఇండియన్ టూరిస్ట్ ఆఫీసులను ప్రారంభించి వేటగాళ్లను ఆకర్షించారు. 1954లో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. కేవలం 620 డాలర్లు చెల్లిస్తే 10 రోజుల పాటు అడవుల్లో తిప్పి, ఖచ్చితంగా పులిని పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చే అవకాశాన్ని (షూర్ షాట్ గ్యారంటీ) ఏజెన్సీలు కల్పించేవి. తర్వాతి కాలంలో ఇది ఏకంగా 2,500 డాలర్ల వరకు పెరిగినా విదేశీయులు పోటెత్తేవారు.

దైవ భూమిలోకి తొలిసారి నీలి కళ్ల తెల్ల పులి ఎంట్రీ! 556 కిలోమీటర్లు ప్రయాణం
దైవ భూమిలోకి తొలిసారి నీలి కళ్ల తెల్ల పులి ఎంట్రీ! 556 కిలోమీటర్లు ప్రయాణం

రాజవంశాల వేట పిచ్చి.. వేలల్లో మృత్యువాత పడ్డ క్రూరమృగాలు

అప్పటి బ్రిటీష్ అధికారులు, మన దేశానికి చెందిన రాజులు వేటను తమ హోదాకు, శౌర్యానికి నిదర్శనంగా భావించేవారు. తమ గది గోడలపై చనిపోయిన పులుల తలలను తగిలించుకోవడానికి పోటీపడేవారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సర్గుజా మహారాజా రామానుజ్ శరణ్ సింగ్ డియో ఒక్కడే ఏకంగా 1,157 పులులను వేటాడి చంపినట్లు అధికారిక ఆధారాలు చెబుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి ఐదేళ్లు పూర్తయిన తర్వాత కూడా రాజులు ఈ స్థాయిలో మారణకాండ సాగించారంటే వేట నియమాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 1860 నుంచి 1970 మధ్య కాలంలో కేవలం సరదా వేట కోసమే దాదాపు 20,000 పులులను బలి తీసుకున్నట్లు పర్యావరణ నిపుణులు అంచనా వేశారు.

అటు వేటను ప్రోత్సహిస్తూ.. ఇటు ప్రసంగాలు ఇస్తూ!

అప్పట్లో ఒక పెద్ద విచిత్రమైన వైరుధ్యం నెలకొంది. ఓవైపు నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అడవులను, జంతువులను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిస్తుంటే.. అదే ప్రభుత్వంలోని పర్యాటక శాఖ మాత్రం విదేశీయులను పిలిచి పులులను చంపమని ఆహ్వానాలు పంపేది. ప్రభుత్వం నుంచి విదేశీ మారకద్రవ్యాన్ని పొంది మరీ ప్రైవేట్ వేట ఏజెన్సీలు అంతర్జాతీయ వేదికలపై ప్రచారం చేసుకునేవి. అయితే, విపరీతమైన వేట, పులి చర్మాలకు గ్లోబల్ ఫ్యాషన్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరగడంతో స్మగ్లింగ్ ముఠాలు రంగంలోకి దిగాయి. దీంతో భారత్‌లో పులుల సంఖ్య తీవ్రంగా పడిపోయి, అవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.

70 ఏళ్ల తర్వాత అడవిలోకి అడుగుపెట్టిన రాక్షస పులి..
70 ఏళ్ల తర్వాత అడవిలోకి అడుగుపెట్టిన రాక్షస పులి..

ఇందిరాగాంధీ సంచలన నిర్ణయం.. 'ప్రాజెక్ట్ టైగర్'తో ఊపిరి పోసుకున్న అడవి!

అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలు, దేశంలో వేగంగా తగ్గిపోతున్న పులుల సంఖ్యను గమనించిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1970లో దేశవ్యాప్తంగా పులుల వేటపై పూర్తిగా నిషేధం విధించారు. ఆ తర్వాత చారిత్రాత్మక 'వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ - 1972' చట్టాన్ని తీసుకువచ్చి జంతువుల వేటను, వాటి అవయవాల విక్రయాన్ని తీవ్రమైన నేరంగా మార్చారు. ఏప్రిల్ 1973లో కేవలం 9 పులుల అభయారణ్యాలతో 'ప్రాజెక్ట్ టైగర్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1972 నాటికి దేశంలో కేవలం 1,827గా నమోదైన పులుల సంఖ్య, నిరంతర సంరక్షణ చర్యల వల్ల 2022 నాటికి 3,682కు పైగా పెరిగింది. ఒకప్పుడు తుపాకీ గుళ్లకు బలి ఇచ్చిన పులులను కాపాడుకోవడానికి నేడు భారతదేశం ప్రపంచానికే మార్గదర్శిగా నిలవడం చారిత్రక పరిణామం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+