ఢిల్లీ ఆందోళనల ఎఫెక్ట్..! రూటు మార్చేస్తున్న ఏపీ పార్టీలు..! ఎటూతేల్చుకోలేని ఒక్కరు..!

ఢిల్లీ రాజకీయాల ప్రభావం ఏపీపై అనివార్యంగా పడుతోంది. నిన్న మొన్నటివరకూ తప్పొప్పులతో సంబంధం లేకుండా బీజేపీకి అధికారిక మిత్రపక్షాలుగా కొనసాగిన టీడీపీ, జనసేన, అనధికారిక మిత్రపక్షంగా ఉన్న వైఎస్సార్సీపీ ఇప్పుడు ఢిల్లీ ఆందోళనల నేపథ్యంలో పునరాలోచనలో పడుతున్నాయి. అయితే బీజేపీని నేరుగా ఏమీ అనకుండా ఎస్ఐఆర్ సహా ఈసీ చర్యల్ని టార్గెట్ చేస్తున్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్లు మొదలుపెడుతున్నాయి. అయితే ఇందులో ఒక పార్టీ మాత్రం ఏం చేయాలో పాలుపోక వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. దీంతో ఏపీ రాజకీయాల్లో (AP Politics) మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

'Gyanu, It’s Done Bro’: సీజేపీ, విపక్షాలు, విద్యార్ధుల్ని ఏకం చేస్తున్న ఒకే ఒక్క నినాదం..!
'Gyanu, It’s Done Bro’: సీజేపీ, విపక్షాలు, విద్యార్ధుల్ని ఏకం చేస్తున్న ఒకే ఒక్క నినాదం..!

ఎస్ఐఆర్ లో అక్రమాల ఆరోపణల తర్వాత ఓట్ల చోరీ జరిగిందని భావించే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో పాటే ఇందుకు కారణమైన సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్లూ పెరుగుతున్నాయి. ఇందులో జాతీయ స్దాయిలో విపక్ష పార్టీలతో పాటు కాక్రోచ్ జనతా పార్టీ, విద్యార్ధి సంఘాలు కూడా ఉన్నాయి. గతంలో జెన్ జీ ఉద్యమం కారణంగా నీట్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సమయంలోనే పునరాలోచనలో పడిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు.. ఇప్పుడు ఓట్ల చోరీకి ఎక్కడికక్కడ ఆధారాలు దొరుకుతుండటం, నిరసనలు పెరుగుతుండటంతో మళ్లీ ఆలోచనలో పడ్డాయి. అలాగని వెంటనే బీజేపీపై రెచ్చిపోయే పరిస్ధితి లేదు. దీంతో ఎవరికి తోసిన విధంగా వారు యూటర్న్ తీసుకునేందుకు సిద్దంగా ఉన్నారు.

AP Politics TDP YSRCP Rethink BJP Stance Ahead of Major Delhi Protest Pawan Kalyan Holds Firm
ఏపీ స్థానిక ఎన్నికలపై ఈసీకి వైసీపీ కీలక డిమాండ్..!
ఏపీ స్థానిక ఎన్నికలపై ఈసీకి వైసీపీ కీలక డిమాండ్..!

ఈసీలో విభేదాలపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం తర్వాత సీఈసీ జ్ఞానేష్ కుమార్ వివరణ ఇవ్వాలని టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు కోరగా.. వైసీపీ ఏకంగా సీఈసీని తొలగించాలని కేంద్రాన్ని కోరింది. అలాగే గతంలో తమ మద్దతుతో పార్లమెంట్ లో నెగ్గించుకున్న ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలో ఇప్పుడు మారిన పరిస్ధితుల కారణంగా సమీక్ష చేయాలని నేరుగా జగనే ట్వీట్ చేశారు. ఆ తర్వాత కూడా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎన్నికల కమిషనర్ల నియామక చట్టంలో మార్పులకు డిమాండ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు టీడీపీ అయితే నేరుగా మాట్లాడకుండా, అనుకూల మీడియా ఛానళ్లు, పత్రికల్లో సీఈసీ చర్యల్ని ప్రశ్నిస్తోంది. టీవీల్లో డిబేట్లు కూడా పెట్టిస్తోంది. ఇదంతా చూస్తుంటే టీడీపీతో పాటు వైఎస్సార్సీపీ కూడా రూటుమార్చుకుంటున్నట్లు అర్దమవుతోంది. ఢిల్లీలో పరిణామాలు మరింత ముదిరితే అప్పుడు ఈ రెండు పార్టీలు నేరుగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు టీడీపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఈసీ జోలికి వెళ్లడం లేదు. దేశమంతా భారీ ఆందోళనలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండిపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+