సీఈసీ జ్ఞానేష్ కుమార్ సెక్యూరిటీలో బిగ్ ఛేంజ్! రంగంలోకి పారా మిలటరీ కమాండోలు

దేశంలో ప్రస్తుతం సాగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ చుట్టూ వివాదాలు నానాటికీ తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ విపక్షాలు, యువజన సంఘాలు చేపడుతున్న ఆందోళనలు రాజధాని ఢిల్లీని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నిరసనల సెగ నేరుగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు తగలడంతో అధికారులు ఆయన భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఆయనకు ఇప్పటికే ఉన్న వీఐపీ భద్రతను మరింత పెంచి, పారామిలటరీ కమాండోలతో జెడ్ + రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు.

ఇటీవల ఇండియన్ యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలోని న్యూ మోతీ బాఘ్‌లో ఉన్న సీఈసీ అధికారిక నివాసాన్ని వెతుక్కుంటూ వెళ్లి సమీపంలో భారీ నిరసనలు చేపట్టారు. అంతటితో ఆగకుండా యూపీలోని ఆగ్రాలో ఉన్న ఆయన కుటుంబ సభ్యుల నివాసం వద్ద కూడా ఆందోళనకారులు ధర్నాకు దిగారు. నిరసనకారులు ఏకంగా ఆయన నివాస పరిసరాల్లోకి ప్రవేశించేందుకు యత్నించడంతో పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించింది. వెంటనే పరిస్థితిని సమీక్షించి, సీఈసీ భద్రతను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టింది.

Z Security Upgraded for CEC Gyanesh Kumar Following Protests in Delhi and Agra Tour Postponed

కమాండోల నిఘాలో సీఈసీ నివాసం

ప్రస్తుతం జ్ఞానేష్ కుమార్‌కు అత్యున్నత స్థాయి 'జెడ్ ప్లస్' (Z+) కేటగిరీ భద్రత అమల్లో ఉంది. ఇందులో భాగం గానే సీఆర్‌పీఎఫ్, ఢిల్లీ పోలీసులకు చెందిన 55 మందికి పైగా ఆర్ముడ్ కమాండోలు, పీఎస్వోలు 24 గంటలు ఆయన రక్షణ బాధ్యతలను చూస్తున్నారు. న్యూ మోతీ బాఘ్‌లోని ఆయన కాలనీ పరిసరాల్లో పోలీసు వాహనాలు, పారామిలటరీ కమాండోల బస్సులు రౌండ్ ది క్లాక్ కాపలా కాస్తున్నాయి. లోపలికి వచ్చే ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తర్వాతే అనుమతినిస్తున్నారు.

ప్రియాంకను లాగిపారేసిన పోలీసులు-రాహుల్ అరెస్టు..! ఢిల్లీలో మళ్లీ హైడ్రామా..!
ప్రియాంకను లాగిపారేసిన పోలీసులు-రాహుల్ అరెస్టు..! ఢిల్లీలో మళ్లీ హైడ్రామా..!

నిర్వాచన్ సదన్ వద్ద ర్యాపిట్ యాక్షన్ ఫోర్స్!

మరోవైపు ఢిల్లీ అశోకా రోడ్డులో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం 'నిర్వాచన్ సదన్' వద్ద కూడా అదనపు బలగాలను మోహరించారు. భవనం లోపల సీఐఎస్‌ఎఫ్ (CISF) భద్రత కొనసాగుతుండగానే, బయట విపక్షాల ధర్నాలను అడ్డుకోవడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), సీఆర్‌పీఎఫ్, ఢిల్లీ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజువారీ నిరసనల నేపథ్యంలో భవన భద్రతను అత్యంత కఠినతరం చేశారు.

జ్ఞానేష్ కుమార్ వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయం
జ్ఞానేష్ కుమార్ వ్యవహారంలో సుప్రీంకోర్టు నిర్ణయం

ఉన్నపళంగా ఛత్తీస్‌గఢ్ పర్యటన రద్దు!

సీఈసీ భద్రతా కారణాలు, విపక్షాల ఆందోళనల నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్ రెండు రోజుల ఛత్తీస్‌గఢ్ పర్యటన హఠాత్తుగా వాయిదా పడింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఆయన అక్కడ దంతేశ్వరి ఆలయ దర్శనంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను స్టేట్ గెస్ట్‌గా ప్రకటిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే మంగళవారం సాయంత్రం అనివార్య కారణాల వల్ల ఈ పర్యటనను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. తదుపరి పర్యటన తేదీలను ఎన్నికల సంఘం త్వరలోనే ఖరారు చేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+