నిన్న ఎన్టీఆర్, నేడు మంత్రి బంధువు.. కూటమి ఎమ్మెల్యేకు కోరుకుంటున్న కాంట్రవర్సీ?

అనంతపురం రాజకీయాల్లో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారారు అర్బన్ ఎమ్మెల్యే. కూటమి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో పార్టీని పరుగులు తీస్తారనుకుంటే.. వరుస వివాదాలతో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పార్టీ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారారనే ప్రచారం గట్టిగా సాగుతోంది. తాజాగా ఓ మహిళ నుంచి వచ్చిన భూ వివాదం ఫిర్యాదు, పోలీసుల వరకు వెళ్లడం ఉమ్మడి అనంతపురం జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. స్థలం కొనుగోలు ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకుండా తనను వేధిస్తున్నారంటూ సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి బంధువు, కర్నూలుకు చెందిన దివ్యభారతి ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించడం ప్రకంపనలు సృష్టిస్తోంది.

స్థలం వ్యవహారంలో ఏం జరిగింది?

బాధితురాలు అందించిన ఫిర్యాదు ప్రకారం.. అనంతపురం భైరవ్‌నగర్‌లోని సర్వే నంబరు 396లో ఉన్న 10 సెంట్ల స్థలాన్ని విక్రయించేందుకు నాలుగు నెలల క్రితం ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులతో మాట్లాడారు. రూ. 70 లక్షలకు బేరం కుదిరి, ఎమ్మెల్యే అనుచరుడైన టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ పేరిట అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ సమయంలో రూ. 10 లక్షల అడ్వాన్స్ ఇచ్చి, నెల రోజుల్లో మిగతా రూ. 60 లక్షలు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు.

Anantapur Urban MLA Daggupati Venkateswara Prasad Named in Land Harassment Complaint Filed With DIG and SP

కేసులు పెడతామంటూ బెదిరింపులు!

అయితే గడువు తీరినా డబ్బులు ఇవ్వకపోగా, రిజిస్ట్రేషన్ చేయకపోతే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగారని బాధితురాలు ఆరోపించారు. నెలన్నర క్రితమే వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు స్పందించకపోవడంతో, ఆమె ఏకంగా ఎమ్మెల్యేతో జరిగిన ఫోన్ చాటింగ్, ఆడియో, వీడియో సంభాషణలు, సీసీ టీవీ ఫుటేజీ ఆధారాలను అనంతపురం రేంజ్ డీఐజీ షిమొషికి సమర్పించారు. డీఐజీ ఆదేశాలతో ఎస్పీ జగదీష్ ఫిర్యాదు స్వీకరించి సమగ్ర విచారణకు ఆదేశించారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు టెన్షన్ లో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, అనంతలో ఉద్రిక్తత
ఎన్టీఆర్ ఫ్యాన్స్ దెబ్బకు టెన్షన్ లో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, అనంతలో ఉద్రిక్తత

గతంలో జూనియర్ ఎన్టీఆర్‌పై వివాదాస్పద కామెంట్స్!

ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. నందమూరి, నారా అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఆ వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయాంశమై ప్రధాన వార్తల్లో నిలిచాయి. ఆ వివాదం నుంచి తేరుకోకముందే, ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకి చెందిన మంత్రి బంధువు నుంచే నేరుగా భూ అక్రమాలు, బెదిరింపుల ఆరోపణలు రావడం ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసింది. అయితే ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, సదరు మహిళ ఎవరో కూడా తనకు తెలియదని ఎమ్మెల్యే దగ్గుపాటి స్పష్టం చేశారు.

సీనియర్‌ను పక్కనబెట్టి ఇస్తే.. అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారా?

తెలుగుదేశం పార్టీకి దశాబ్దాలుగా నమ్మకమైన విధేయుడిగా ఉంటూ, నియోజకవర్గంలో బలమైన కేడర్ కలిగిన సీనియర్ నాయకుడు ప్రభాకర్ చౌదరిని పక్కనబెట్టి మరీ చంద్రబాబు నాయుడు దగ్గుపాటి ప్రసాద్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారు. కానీ, తనకు లభించిన బంగారు లాంటి అవకాశాన్ని ఆయన నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే చర్చ తమ్ముళ్లలోనే జరుగుతోంది. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సింది పోయి వరుస వివాదాలు, ఆరోపణలతో పార్టీకి మైలేజ్ తగ్గించేస్తున్నారనే ఆగ్రహం అధిష్ఠానంలో వ్యక్తమవుతోంది.

తాట తీస్తా.. సొంత పార్టీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే కొలకపూడి ఘాటు హెచ్చరిక!
తాట తీస్తా.. సొంత పార్టీ నేతలకు టీడీపీ ఎమ్మెల్యే కొలకపూడి ఘాటు హెచ్చరిక!

క్రమశిక్షణ చర్యలు తప్పవా? చంద్రబాబు ఉక్కుపాదం!

పార్టీ ఇమేజ్‌కు భంగం కలిగించే నేతలు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. శ్రేణుల తీరు మారాలని, ప్రజా ప్రతినిధులు వివాదాలకు దూరంగా ఉండాలని పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోజుకో ఆరోపణతో వార్తల్లోకి వస్తున్న అనంతపురం ఎమ్మెల్యేపై డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేందుకు అధిష్ఠానం రంగం సిద్ధం చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. విచారణ నివేదికల ఆధారంగా అధినేత ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటారోనని పచ్చ శిబిరంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+