పండగ వేళ.. పసిడి ధరల్లో ఫుల్ స్వింగ్- భారీ పురోగమనం

దేశవ్యాప్తంగా పండుగల సీజన్ నడుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయంగా బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతోంది. నేడు పసిడి ధరలు స్వల్పంగా పుంజుకొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లల్లో చోటుచేసుకుంటోన్న పరిణామాలు, పశ్చిమాసియాలో చల్లారని ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ విలువ, ట్రెజరీ బాండ్ల రాబడులు క్షీణించడం.. వంటి పలు ఆర్థిక కారణాల వల్లే దేశీయంగా బంగారం, వెండికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పసిడి ధర 0.72 శాతం లాభపడింది. 10 గ్రాముల 24 క్యారరెట్ల బంగారం ధర 1.50 లక్షల రూపాయల మార్క్ ను అధిగమించింది. అదే క్రమంలో వెండి ఫ్యూచర్స్ ధర కూడా భారీగా పుంజుకుంది. ఎంసీఎక్స్ లో 1.22 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. కిలోకు 2,24,180 రూపాయల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఈ పెరుగుదల.. పండగ సీజన్ లో సామాన్య కొనుగోలుదారులపై అదనపు భారాన్ని మోపినట్టయింది.

Gold and silver prices in India regain as 24K 22K and 18K trading at Higher at MCX as Swings today

గురువారం నాటి క్లోజింగ్ ట్రేడింగ్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ. 1,140 పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్లు రూ. 1,050, 18 క్యారెట్లు రూ. 850 మేర పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,920 వద్ద ట్రేడ్ అయింది. 22 క్యారెట్లు రూ. 1,38,343 వద్ద స్థిరపడగా.. వెండి రూ. 2,24,110 గా నమోదైంది.

తమిళనాడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయ్ కు ఝలక్: ఒక చోట లీడ్.. మరో చోట సీన్ రివర్స్
తమిళనాడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయ్ కు ఝలక్: ఒక చోట లీడ్.. మరో చోట సీన్ రివర్స్

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,50,720 కాగా 22 క్యారెట్లు రూ. 1,38,160 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ వెండి కిలో రూ. 2,23,770 పలుకుతోంది. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 1,50,800గా రికార్డయింది. 22 క్యారెట్లు రూ. 1,38,233, వెండి రూ. 2,23,930 వద్డ ట్రేడింగ్ అయ్యాయి. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,51,120, రూ. 1,38,527, రూ. 2,24,410 గా రికార్డయ్యాయి.

అమెరికా తాజా నిర్ణయం పట్ల టీసీఎస్ రియాక్షన్: అక్కడ 15,000 రిక్రూట్మెంట్స్
అమెరికా తాజా నిర్ణయం పట్ల టీసీఎస్ రియాక్షన్: అక్కడ 15,000 రిక్రూట్మెంట్స్

వివిధ నగరాల్లో బంగారం రేట్లు ఒక గ్రాముకు..

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 15,071, 22 క్యారెట్లు - రూ. 13,815, 18 క్యారెట్లు - రూ. 11,350

ముంబై..

24 క్యారెట్లు - రూ. 15,071, 22 క్యారెట్లు- రూ. 13,815, 18 క్యారెట్లు - రూ. 11,303

బెంగళూరు..

24 క్యారెట్లు - రూ. 15,071, 22 క్యారెట్లు- రూ. 13,815, 18 క్యారెట్లు - రూ. 11,303

హైదరాబాద్..

24 క్యారెట్లు - రూ. 15,071, 22 క్యారెట్లు- రూ. 13,815, 18 క్యారెట్లు - రూ. 11,303

విజయవాడ..

24 క్యారెట్లు - రూ. 15,071, 22 క్యారెట్లు- రూ. 13,815, 18 క్యారెట్లు - రూ. 11,303

విశాఖపట్నం..

24 క్యారెట్లు - రూ. 15,071, 22 క్యారెట్లు- రూ. 13,815, 18 క్యారెట్లు - రూ. 11,303

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+