దసరా వేళ ప్రయాణీకులకు APSRTC బిగ్ రిలీఫ్- ఈ రూట్లలో ప్రయాణం ఇక...!!

తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి మొదలవుతోంది. పాఠశాలలకు సెలవులు ప్రారంభం అవుతున్న వేళ.. పెద్ద సంఖ్యలో ప్రయాణాలకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే ప్రధాన మార్గాల్లో రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. అటు రైల్వే .. ఇటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ ఆరు వేలకు పైగా ప్రత్యేక బస్సులను ప్రకటించింది. దీంతో.. ఏపీకి పెద్ద సంఖ్యలో ప్రయాణాలను పరిగణలోకి తీసుకొని ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులకు రిలీఫ్ దక్కనుంది.

ఏపీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. దసరా రద్దీ వేళ ప్రయాణీకుల కోసం పెద్ద సంఖ్యలో ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. ఈ నెల 16 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా, పొరుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం 5,261 ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రతీ ఏటా దసరా సమయంలో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఆర్టీసీ బస్సుల ద్వారా తమ గమ్య స్థానాలకు చేరుకుంటారు. దీంతో, ఈ సారి ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వివిధ ప్రధాన నగరాలకు ఆర్టీసీ ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో బస్సులను కేటా యించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌కు అత్యధికంగా 1,186 బస్సులు, బెంగళూరుకు 475 ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు.

పవన్ ఆన్ డ్యూటీ: ఇక నేరుగా, స్థానికం వేళ బిగ్ డెసిషన్..!!
పవన్ ఆన్ డ్యూటీ: ఇక నేరుగా, స్థానికం వేళ బిగ్ డెసిషన్..!!
apsrtc-will-operate-5261-special-buses-from-october-16-to-25-in-view-of-the-dussehra-passenger-rush

రద్దీ మార్గాల్లో అదనపు బస్సులు

అలాగే చెన్నై నగరానికి 153 బస్సులను కేటాయించగా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల నుంచి వచ్చే ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు అందుబాటులోకి సర్వీసులు తీసుకొస్తున్నారు. కాగా.. రాష్ట్రం లోని అంతర్గత జిల్లాల మధ్య కూడా పెద్ద సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేసారు. విశాఖ పట్నానికి 440, రాజమహేంద్రవరానికి 347, ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి 247 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. దసరా ప్రయాణికుల కోసం ముందస్తు రిజర్వేషన్ సౌకర్యంతో పాటు బస్సు స్టేషన్లలో అదనపు కౌంటర్లు, తాగునీరు సదుపాయాలు కల్పిస్తోంది. ప్రయాణీకుల స్పందనకు అనుగుణంగా అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+