AP Weather: రేపు అక్కడ వర్షాలు- ఇక్కడ వడగాల్పులు..! ఏ జిల్లాల్లో ఎలా ?
ఏపీలో ప్రస్తుతం మిశ్రమ వాతావరణ (mixed weather) పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ఓవైపు వర్షాలు దంచి కొడుతుంటే, మరోవైపు ఎండలు అదరగొడుతున్నాయి. రేపు కూడా ఇలాంటి మిశ్రమ వాతావరణ పరిస్ధితులే ఉంటాయని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు వాతావరణ పరిస్ధితులకు అనుగుణంగా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ముఖ్యంగా ఎండల బారిన, పిడుగుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతోంది.
రేపు రాష్ట్రంలో 43-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు వడగాలులు వీచే అవకాశం ఉన్న మండలాల్లో అల్లూరి జిల్లా జికే వీధి మండలం, పోలవరం జిల్లా చింతూరు, గంగవరం, కూనవరం,రంపచోడవరం, కోనసీమ జిల్లా ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా చాగల్లు, గోకవరం, కోరుకొండ,కొవ్వూరు, రాజమహేంద్రవరం అర్బన్ & రూరల్, రాజానగరం, సీతానగరం,తాళ్లపూడి, ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, అనంతపురం జిల్లా అనంతపురం రూరల్, బుక్కరాయ సముద్రం మండలాలు ఉన్నాయి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.

అలాగే నైరుతి, ఆనుకొని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం నుండి, తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు చెట్ల క్రింద నిలబడరాదని వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.












Click it and Unblock the Notifications