Tamil Nadu: ఉద్యోగుల డీఏపై విజయ్ కీలక నిర్ణయం-16 లక్షల మందికి..!

తమిళనాడులో తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ (Vijay).. పాలనపై తన మార్కు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ, మరోవైపు పాలనపై తన మార్కు ఉండేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డీఏ పెంపునకు (DA Hike) విజయ్ ఆమోదం తెలిపారు. దీంతో 16 లక్షల మందికి ప్రయోజనం కలగబోతోంది.

NEET ను పూర్తిగా రద్దు చేయాలి: ప్రధాని మోదీకి విజయ్ లేఖ
NEET ను పూర్తిగా రద్దు చేయాలి: ప్రధాని మోదీకి విజయ్ లేఖ

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఉద్యోగుల డీఏను రెండు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చే కరువు భత్యాన్ని (డీఏ) 58% నుండి 60%కి పెంచారు. ఈ నిర్ణయం 2026 జనవరి 1 నుండి అమలు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు లబ్ధి పొందుతారు. ఈ డీఏ పెంపు కారణంగా తమిళనాడు ప్రభుత్వంపై ఏటా ₹1,230 కోట్ల అదనపు భారం పడనుంది.

CM Vijay Hikes DA From 58 to 60 for TN Govt Staff State to Bear 1 230 Crore Extra Burden
Vijay-Udayanidhi: ఉదయనిధికి విజయ్ రిటర్న్ గిఫ్ట్..! అసెంబ్లీలో అరుదైన సన్నివేశం..!
Vijay-Udayanidhi: ఉదయనిధికి విజయ్ రిటర్న్ గిఫ్ట్..! అసెంబ్లీలో అరుదైన సన్నివేశం..!

తమిళనాడులో ప్రభుత్వ మార్పులో ఇతర వర్గాలతో పాటు ఉద్యోగులది కూడా కీలక పాత్ర అని భావిస్తున్న విజయ్.. ఆ మేరకు వారికి వెంటనే ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగుల డీఏ రెండు శాతం పెంచారు. ఇదే క్రమంలో వారికి ఎన్నికల్లో ఇచ్చిన మరిన్ని హామీల్ని కూడా నిలబెట్టుకుంటారని భావిస్తున్నారు. అదే జరిగితే ఉద్యోగ వర్గాల్లోనూ విజయ్ క్రేజ్ మరింత పెరగనుంది. ఈ మేరకు ఉద్యోగులు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారనే దానిపై విజయ్ సమాచారం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+