జూన్ 29 నుంచి ఈ 4 రాశులు పట్టిందల్లా బంగారమే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు, వాటి స్థాన చలనాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గ్రహాల సంచారం, కలయికలతో పాటు 'గ్రహాల తిరోగమనం' మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. నవగ్రహాలలో బుద్ధికి, వ్యాపారానికి, తెలివితేటలకు కారకుడైన బుధుడు త్వరలోనే తిరోగమనం చెందబోతున్నాడు.

జూన్ 29 నుంచి ప్రారంభం కానున్న ఈ తిరోగమనం దాదాపు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈ కాలంలో మొత్తం 12 రాశుల వారి జీవితాల్లో మార్పులు రానున్నప్పటికీ... నాలుగు రాశుల వారికి మాత్రం అదృష్టం వరించబోతోంది. వీరు ఏ పని చేసినా విజయాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆ అదృష్ట రాశులు ఎవరనేది తెలుసుకుందాం.

Horoscope From June 29 Onward These 4 Zodiac Signs Are Set for Extraordinary Success

మిథున రాశి వారికి అప్పుల బాధలు ఉండవు

మిథున రాశి అధిపతి బుధుడే కావడం వల్ల, ఈ తిరోగమనం వీరికి కొన్ని ప్రత్యేకమైన సానుకూల మార్పులను ఇస్తుంది. చాలా కాలంగా పట్టిపీడిస్తున్న అప్పుల బాధల నుంచి విముక్తి లభిస్తుంది. బాకీలు తీరిపోతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది. సమాజంలో మీ ప్రతిభకు తగిన గౌరవం, ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తాయి.

మేష రాశి వారికి రెట్టింపు ఆదాయం

మేష రాశి వారికి ఈ కాలం కెరీర్ పరంగా, ఆర్థికంగా అద్భుతమైన టర్నింగ్ పాయింట్‌గా మారబోతోంది. మీ ఆదాయం ఊహించని విధంగా రెట్టింపు అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు నిరంతరం డబ్బును తెచ్చిపెడతాయి. అనవసర ఖర్చులు తగ్గి, బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరుగుతుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు వారి కలల ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది.

కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే!

బుధుడి తిరోగమనం కర్కాటక రాశి వారికి అద్భుతమైన యోగాన్ని తీసుకొస్తోంది. వీరికి రాబోయే నెల రోజులు 'బంగారు కాలం' అని చెప్పవచ్చు. దీర్ఘకాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి, ధన ప్రవాహం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగుల కలలు ఈ సమయంలో సాకారమవుతాయి. కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి.

కుంభ రాశి వారికి ఆదాయంలో భారీ వృద్ధి!

కుంభ రాశి వారికి ఈ తిరోగమనం ఆర్థికంగా ఊహించని లాభాలను తెచ్చిపెడుతుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. ముఖ్యంగా భూములు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీగా లాభాలు దక్కుతాయి. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి, షేర్ మార్కెట్‌లో అడుగుపెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయ వనరులు పెరిగి, ఆర్థికంగా స్థిరపడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+