'అంత‌ర‌గంగ' వాటర్ ఫాల్స్ చూసొద్దామా..? హైదరాబాద్ కు 20 కి. మీ. దూరంలోనే

తెలంగాణ ప్రాంతానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. వందల సంవత్సరాల క్రితం తెలంగాణను త్రిలింగ దేశంగా పిలిచేవారు. శాతవాహనుల కాలం నుంచి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఆ తర్వాత కాకతీయులు, కుతుబ్ షాహీలు, నిజాం రాజులు తెలంగాణను పరిపాలించారు. ఎన్నో చారిత్రక కట్టడాలను నిర్మించారు. అలాగే తెలంగాణలో ఎన్నో ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక తెలంగాణలో జలపాతాలు అనగానే కుంతల, బొగత జలపాతం, గాయత్రి, గుండాల, పొచ్చెర, భీముని పాదం, మల్లెల తీర్థం, రాయికల్, సప్తగుండాల జలపాతం, సబితం, సిర్నాపల్లి జలపాతాలు గుర్తుకువస్తాయి.

కానీ హైదరాబాద్ కు అతి దగ్గరలోనే అంటే కేవలం 20 కి. మీ. దూరంలోనే అందమైన జలపాతం ఉందని మీకు తెలుసా..? వారం మొత్తం బిజీబిజీ గడిపిన నగరవాసులు వీకెండ్ లో అలా హాయిగా రిలాక్స్ అయ్యేందుకు ఈ ప్రదేశం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ లోని ఎల్ బీ నగర్ నుంచి కేవలం 20 కి. మీ. దూరంలోనే ఉంది ఈ జలపాతం అదే అంతరగంగ వాటర్ ఫాల్స్.. ఈ జ‌ల‌పాతం కూడా ప‌ర్యాట‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని కలిగిస్తోంది. నగరవాసులు వీకెండ్ లో గంటలు గంటలు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా కేవలం అరగంట లోనే ఇక్కడికి చేరుకోవచ్చు.

ఈ జలపాతం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్ మండ‌ల ప‌రిధిలోని కావ‌డిప‌ల్లి గ్రామంలో ఎత్తయిన గుట్టల మధ్య దాగి ఉంది. ఈ గుట్ట‌ల‌న్నీ రాళ్ల‌తో నిండి ఉంటాయి. ఈ రాళ్ల మ‌ధ్య‌లో నుంచి అంత‌ర‌గంగ జ‌ల‌పాతం పొంగిపొర్లుతూ పర్యటకుల్ని ఆహ్వానిస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీకి అత్యంత ద‌గ్గ‌రగా ఉందీ అంత‌ర‌గంగ జ‌ల‌పాతం. అంతేకాదు ఈ జలపాతానికి స‌మీపంలోనే 400 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన శ్రీ కోదండ రామ‌చంద్ర స్వామి ఆల‌యం కూడా ఉంది. ఇక్కడకు వెళ్తే అటు ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి రమణీయమైన ప్రదేశంలో ఎంచక్కా గడపొచ్చు.

Antaraganga Waterfalls Just 20 Km from Hyderabad Complete Details andTravel Guide Antaraganga falls

మరోవైపు హైదరాబాద్ లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది. దాంతో ఈ జలపాతం ఉప్పొంగుతూ మరింత అద్భుతంగా కనువిందు చేస్తుంది. ఈ జలపాతం సంద‌ర్శ‌న‌కు ఉద‌యం 6 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు ఉత్త‌మమైన స‌మ‌యం.. అయితే కాస్త పొద్దున్నే వెళ్తే ఆ వాతావ‌ర‌ణాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది.

ఇక ఈ ప్రాంతాలని చేరుకోవాలంటే ముందుగా.. ఎల్ బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ చేరుకోవాలి. అక్కడి నుంచి కవాడిపల్లికి చేరుకోవాలి. అక్కడి నుంచి 2 కి. మీ. ప్రయాణం చేశాక గుట్టలు కనిపిస్తాయి. ఆ గుట్టల కిందే వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి. సుమారు 30 నిమిషాలపాటు ట్రెక్కింగ్ చేసిన తర్వాత అంతరగంగ జలపాతం దర్శనమిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ సారి ట్రై చేయండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+