ఓటీటీలో సెన్సేషన్‌గా "దివి" బోల్డ్ వెబ్ సిరీస్.. సీన్లు మామూలుగా లేవుగా !!
దివి.. తెలుగు సినీ ప్రియులందరికీ ఈ బిగ్ బాస్ బ్యూటీ సుపరిచితురాలే. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. నటిగా ఎంట్రీ ఇచ్చింది. 2019లో మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో చిన్న పాత్రలో కనిపించినా.. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత A1 ఎక్స్‌ప్రెస్ వంటి సినిమాల్లో నటించింది. అయితే దివి నిజమైన గుర్తింపును తెచ్చింది మాత్రం బిగ్‌బాస్ రియాలిటీ షో అనే చెప్పాలి. ఈ ముద్దుగుమ్మకి బిగ్‌బాస్ షోతో స్టార్ లెవల్ క్రేజ్ దక్కింది. ఈ ఫాలోయింగ్ తోనే దివికి వరుస ఆఫర్లు వచ్చాయి. చిరంజీవి గాడ్ ఫాదర్, మహేష్ బాబు మహర్షి, అల్లు అర్జున్ పుష్ప-2 వంటి పెద్ద సినిమాల్లో కూడా అవకాశం దక్కింది.
అంతే కాకుండా కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌ల్లో నటించింది. సీనియర్ నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో వచ్చిన రుద్రంగి సినిమాలో 'జాజిమొగులాలి' ఫోక్ సాంగ్ రీమేక్ చేశారు. ఇందులో దివి చేసిన ఐటమ్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తన నడుము, డ్యాన్స్ మూవ్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంది. ఇటీవల లంబసింగి అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ అది పెద్దగా విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ సరైన బ్రేక్ కోసం ఇంకా ఎదురుచూస్తోంది.

అయితే ప్రముఖ ఓటీటీ 'ఆహా' (Aha Video) వేదికగా భారీ వ్యూయర్‌షిప్ సాధించింది బోల్డ్ అంథాలజీ సిరీస్ 'ష్' (Sshhh). ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఇప్పుడు సరికొత్త సీజన్‌తో సిద్ధమైంది. పూనమ్ బజ్వా, కిరణ్ రాథోడ్, బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రధాన పాత్రల్లో నటించిన సీజన్ 3 ఓటీటీ ఆడియన్స్ ను ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. కాగా ఈ బోల్డ్ సిరీస్ లోకి దివి ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆహా లో జూన్ 12, 2026 నుండి స్ట్రీమింగ్ అవుతోండగా.. మొదటి రెండు సీజన్ల కంటే ఈసారి మరింత బోల్డ్‌గా మరియు ఎమోషనల్‌గా ఈ ఆంథాలజీని రూపొందించారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
మరోవైపు దివికి సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. ఇన్‌స్టాగ్రామ్‌లోనే 1.3 మిలియన్లకుపైగా అభిమానులు ఉన్నారు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోషూట్స్‌ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.












Click it and Unblock the Notifications