10వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య, ప్రిన్సిపాల్ సస్పెండ్
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని వట్లూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దెందులూరు మండలం, రామారావుగూడెంకు చెందిన కత్తె రచన(15) పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది.
మంగళవారం రాత్రి తరగతి గదిలో చున్నీతో ఉరివేసుకుంది. బుధవారం ఉదయం పాఠశాల వాచ్‌మెన్ చూసి ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. దీంతో ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్ధలానికి చేరుకున్నారు.

విద్యార్ధిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర ఒత్తిడితోనే రచన ఆత్మహత్య చేసుకుందని మీడియాలో వార్త కథనాలు వెలువడుతున్నాయి. రచన ఆత్మహత్య విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.
దీంతో ప్రిన్సిపాల్ భారతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురుకుల పాఠశాల ఘటనపై వెంటనే స్పందించిన కలెక్టర్ భాస్కర్ దర్యాప్తునకు అదేశించారు. విద్యార్ధిని మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. సంఘటనా స్ధలానికి చేరుకున్న ఏలూరు డీఎస్పీ రచన మృతికి గల కారణాలను పాఠశాల విద్యార్ధినిలను అడిగి తెలుసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications