ట్రిపుల్ ఐటీలో విద్యార్ధిని అనుమానాస్పద మృతి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం

అమరావతి: ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్ధిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సోమవారం చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ట్రిపుల్ ఐటీలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని వస్మాల్ హాస్టల్‌లో ద్రవపదార్ధం తాగి బలవన్మరణానికి యత్నించింది.

వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్ధిని అనారోగ్యంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విషాదం

కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి బిడ్డకు విషమిచ్చి, ఆ తర్వాత ఆమె కూడా తాగిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం, ఎమ్మినగనూరులోని ఎస్పీఎం కాలనీకి చెందిన బొజ్జమ్మ (30) తన భర్త రెండో వివాహం చేసుకున్నాడని మసస్తాపంతో ఐదేళ్ల వయసున్న కొడుకుకు విషం తాగించింది.

Student suspicious death in ysr district

ఆ తర్వాత ఆమె కూడా తాగింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు:

అనంతపురం జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాకి చెందిన ఇద్దరు వ్యక్తులు కారులో బెంగుళూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో చెన్నేకొత్తపల్లి సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆ కారు డివైడర్‌ను ఢీకొట్టింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు ధర్మవరం ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+