విద్యార్థిని చావగొట్టిన స్టూడెంట్స్.. ప్లీజ్ అని బతిమిలాడిన వినకుండా దాడి, ఎక్కడంటే..?
కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణలు కామనే. కానీ గదిలో చచ్చేలా కొట్టడం.. అదీ కూడా చిన్న గొడవకే చావగొట్టారట. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈ ఘటన జరిగింది. ఎస్ఆర్ కేఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ గదిలో ఇన్సిడెంట్ జరిగింది. ఆ వీడియో బయటకు వచ్చింది. సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో ట్రోల్ అవుతుంది.
వీడియోలో కనిపించే ఐదుగురు ఇంజినీరింగ్ స్టూడెంట్స్.. వారంతా కలిసే ఉన్నారు. అయితే ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. అతని పక్కన మరో ముగ్గురు నిలువగా.. ఒక్కడిని చేశారు. గదిలో కర్రలు, పీవీసీ పైపులతో దాడి చేశారు. ప్లీజ్ ఆపండి రా అని మొత్తుకున్నా వారు వినలేదు. ఆ వీడియోలో అతనిని చూస్తే ప్రతీ ఒక్కరికీ జాలి వేస్తోంది.

అంతకుముందు ఐరన్ బాక్స్‌తో ఛాతీపై వాతలు కూడా పెట్టారట. తీవ్రంగా గాయ పడటంతో విద్యార్థి అంకిత్‌ను భీమవరం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగ్గానే ఉందట. కానీ గాయాలు మాత్రం ఎక్కువే అయ్యాయి. వీడియో బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఇటు కాలేజీ యాజమాన్యం కూడా రంగంలోకి దిగింది. ఇరువురితో చర్చలు జరుపుతుంది. కేసును రాజీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. కేసు పెడితే ఆ ముగ్గురు భవిష్యత్ పాడవుతుందని.. అందుకే కాంప్రమైజ్ చేస్తున్నారు. కానీ అంకిత్‌ను మాత్రం ముగ్గురు విచక్షణారహితంగా దాడి చేశారు. బతిమిలాడినా వినలేదు.












Click it and Unblock the Notifications