బాబుపై ఇలానా, అదీ ఆంధ్రజ్యోతిలో.. : 'భజన' అపవాదు నుంచి తప్పించుకునేందుకేనా!?
విజయవాడ : రాజకీయాల్లో స్థిరత్వాన్ని సంపాదించడం.. అంత ఆషామాషీగా జరిగిపోయే వ్యవహారం కాదు. ప్రస్తుత రాజకీయాల్లో అయితే వ్యూహాలు, రాజకీయ చతురత మాత్రమే సరిపోవు. పార్టీని పార్టీ అధినేతలను జనంలోకి బలంగా తీసుకెళ్లగల మీడియా కావాలి. ప్రతికూల సమయంలోను పార్టీ తరుపున నిలబడి వాయిస్ వినిపించగల మీడియా మేనేజ్ మెంట్ ను కలిగి ఉండాలి. ఆ విషయంలో ఏపీ అధికార పార్టీ టీడీపీకి మీడియా పరంగా ఎంత వివిస్తృతి ఉందో అందరికీ తెలిసిన విషయమే.
ముఖ్యంగా ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు టీడీపీని ఎంతలా వెనుకేసుకొస్తాయి..? చంద్రబాబును ఎంతగా సమర్థిస్తాయి..? అన్న విషయాలు కూడా జగమెరిగిన సత్యాలే. అయితే చంద్రబాబును అంతలా అంటిపెట్టుకుని ఉండే సదరు పత్రికలో చంద్రబాబుకు ప్రతికూలంగా వార్తలు రావడం మాత్రం ఒకింత చర్చనీయాంశమే. అదీ.. ఆయన గురించి సైటెరికల్ గా వార్తలు రాయడం.

ఇంతకీ ఆ కథనం ఏంటంటే.. టెలికాన్ఫరెన్స్ ల ద్వారా చంద్రబాబు అధికారులకు పెద్ద తలనొప్పిలా తయ్యారయ్యారనేది ఆ కథనం సారాంశం. టెలికాన్ఫరెన్స్ ల్లో ప్రత్యేకతలు ఉండట్లేదని, మూస ధోరణిలోనే సాగిపోతున్నాయని అధికారులను విమర్శిస్తోన్న చంద్రబాబు.. 'పాడిందే పాడరా.. అన్నట్టు మాటిమాటికి తన ఫ్లాష్ బ్యాక్ పాలనను గుర్తిచేసి గంటల తరబడి అధికారులకు క్లాస్ పీకుతున్నారనే' వార్తను ప్రచురించింది సదరు పత్రిక.
అంతేకాదు.. చంద్రబాబు వ్యవహారశైలికి తట్టుకోలేక టెలికాన్ఫరెన్స్ అంటే చాలు అధికారులంతా జండూబామ్, అమృతాంజనంలతో వస్తున్నారని చంద్రబాబుపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. ఇదంతా చదివాక.. చంద్రబాబుకు అంతలా అనుకూలంగా వ్యవహరించే పత్రిక ఉన్నట్టుండి రూట్ మార్చిందా? అన్న అనుమానాలు తలెత్తకమానవు. అయితే రూట్ మార్చడం సంగతి పక్కనబెడితే.. మరీ భజన మీడియాలా తయారవుతోందన్న అపవాదు నుంచి తప్పించుకునేందుకే అప్పుడప్పుడు ఇలాంటి కథనాలు కూడా ప్రచురిస్తున్నారనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైమైనా మీడియా మేనేజ్ మెంట్ లో ఆరితేరిన టీడీపీకి, చంద్రబాబుకు ఈ సెటైర్లు ఓ లెక్కనా..!












Click it and Unblock the Notifications