హైదరాబాద్ వర్సిటీలో ఆత్మహత్యలు: ఎందుకు?
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. పలు కారణాలతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం ఇటీవలి కాలంలో తరుచుగా జరుగుతున్నాయి. పిహెచ్‌డి స్కాలర్ వెంకటేష్ ఆత్మహత్యతో విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థులు క్షణికావేశంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అధ్యాపకుల వేధింపులు, వివక్ష, ప్రేమ వైఫల్యాలు ఆత్మహత్యలకు కారణంగా మారుతున్నట్లు చెబుతున్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఇప్పటి వరకు 11 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో ఐదుగురు పరిశోధక విద్యార్థులు కాగా, ఇద్దరు పిజీ విద్యార్థులు ఉన్నారు.

ప్రేమ విఫలమై..
ప్రేమవిఫలమై 2006లో అశిన్ ధావన్, 2007లో కేశవాచారి, 2007లో సునీత, 2012లో స్వాతిరాణి, 2012లో స్వరణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. వేధిపులతో 2008లో సెంథిల్ కుమార్, 2009లో బాలరాజు, 2012లో నరేష్ కుమార్ రెడ్డి, 2013లో పుల్యాల రాజు ఆత్మహత్య చేసుకున్నారు.
2013 ఆగస్టులో ఇంటిగ్రేటెడ్ విద్యార్థి మోహినీ మిశ్రా అనుమానాస్పద స్థితిలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి మరణించింది. విద్యార్థుల మరణాలపై విచారణ జరిపిస్తామని, ఇందుకు ఓ కమిటీని వేస్తామని వైస్ చాన్సలర్ చెప్పారు. వెంకటేష్ ఆత్మహత్య నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications