బాబుపై నమ్మకముంది: సుమిత్ర, బాధ్యత పెరిగిందని..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్వరగా అభివృద్ధి చెందాలని లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆకాంక్షించారు. ఆమె శనివారం ఏపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రెండో రోజు జరిగిన శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఆమెతోపాటు కేంద్రమంత్రి నజ్మా హెప్తుల్లా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. ఏపిని అభివృద్ధి పథంలో నడిపిస్తారనే నమ్మకం ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంపై ఉందని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఎమ్మెల్యేలకు బాధ్యత పెరిగిందన్నారు. చట్ట సభల్లో క్వశ్చన్ అవర్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు.

 Sumitra Mahajan desire AP development

సభ్యులు సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సుమిత్రా మహాజన్ అన్నారు. అంశాలపై అవగాహనతో మాట్లాడాలని ఆమె సభ్యులకు సూచించారు.
సభ్యులు సభ గౌరవం పెంచేలా వ్యవహరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హాజరై సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. సభ్యులు సభలో బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+